Formula E-Race: అందుకే ఫార్ములా ఈ-రేస్‌ రద్దు.. మంత్రి భట్టి కీలక వ్యాఖ్యలు

ఫార్ములా ఈ-రేస్‌ రద్దుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేసు నిర్వహించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదని అన్నారు. BRS నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

New Update
Formula E-Race: అందుకే ఫార్ములా ఈ-రేస్‌ రద్దు.. మంత్రి భట్టి కీలక వ్యాఖ్యలు

Deputy CM Bhatti Vikramarka: గత ఏడాది హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్‌ ఈ సంవత్సరం రద్దు కావడంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. ఫార్ములా ఈ-రేస్‌ వల్ల హైదరాబాద్ కు, రాష్ట్రానికి చాలా నష్టం జరిగిందని అన్నారు. దీనిపై గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఫార్ములా ఈ-రేస్‌ పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలని అన్నారు.

ALSO READ: వైసీపీ అసంతృప్తి నేతల భేటీ.. జగన్‌కు మరో షాక్ తగలనుందా?

ఒక కంపెనీ కోసమే...

ఫార్ములా ఈ-రేస్‌ టికెట్లు అమ్ముకుని ఓ కంపెనీ లబ్ధిపొందింది అని అన్నారు భట్టి విక్రమార్క. ఫార్ములా ఈ-రేస్‌లో ముగ్గురు వాటాదారులున్నారని పేర్కొన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా ఉందని అన్నారు. అయితే.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి లాభం ఏమీ లేదని అన్నారు. ఫార్ములా ఈ-రేస్‌ టికెట్లు వేరే కంపెనీ అమ్ముకుందని.. కానీ, గత ప్రభుత్వం ఈ ఈవెంట్ ను నిర్వహించడానికి కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. దీని వల్ల రాష్ట్ర ప్రజలకి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ వచ్చిన లాభం ఏమిలేదని తెలిపారు. కేవలం కొందరి లాభాల కోసమే గత ప్రభుత్వం ఈ ఫార్ములా రేసును పెట్టిందని తెలిపారు.

మాజీ మంత్రుల తప్పుడు ఆరోపణలు..

ఈ సారి హైదరాబాద్ లో ఫార్ములా ఈ-రేస్‌ జరగకపోవడంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు, నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేస్‌పై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. ఈ-రేస్ వెనక్కి వెళ్లడంతో తెలంగాణకు నష్టం జరిగిందని బీఆర్‌ఎస్‌ నేతలంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టిందని నిప్పులు చెరిగారు భట్టి. ఫార్ములా ఈ-రేస్‌పై ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలని అన్నారు. తమ ప్రభుత్వం ప్రతీ పైస రాష్ట్ర ప్రజల కోసమే ఖర్చు చేస్తుందని అన్నారు.

ఫార్ములా ఈ రేస్‌ రద్దు.. ఆ సంస్థ ఏమందంటే..

ఫిబ్రవర్ 10న హైదరాబాద్‌లో (Hyderabad) జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ను రద్దు చేస్తున్నామని ఫార్ములా ఈ రేస్ (Formula E Race) ఆపరేషన్స్ ప్రకటించింది. ఈ-రేస్ సీజన్ 10కు చెందిన నాలగవ రౌండ్ ఇక్కడ జరగాల్సి ఉంది. అయితే ఈ రేస్ గురించి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) స్పందించలేదని… దానికి తోడు మున్సిప‌ల్ శాఖ‌ (GHMC), హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 30వ తేదీ జ‌ర‌గిన ఒప్పందాన్ని మున్సిప‌ల్ శాఖ ఉల్లంఘించిన‌ట్లు ఒక ప్రక‌ట‌న‌లో పేర్కొన్నారు. దాంతో పాటూ మున్సిపల్ శాఖకు నోటీసులు కూడా జారీ చేశామని చెబుతున్నారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈవో చెబుతోంది.

ALSO READ: సైఫ్ మీద వచ్చిన ఆరోపణలు నిజమే.. ర్యాగింగ్ నిరోధక కమిటీ

Advertisment
Advertisment
తాజా కథనాలు