Watch Video: భారత్‌ను కించపరిచిన పాకిస్థానీ.. బుద్ధి చెప్పిన క్యాబ్ డ్రైవర్

ఢిల్లీలోని ఓ క్యాబ్‌లో వెళ్తున్న ఓ పాకిస్థానీ భారత్‌ను కించపరుస్తూ మాట్లాడాడు. ఆ వ్యక్తితో పాటు ఉన్న ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్ కూడా అతనికి మద్దతు తెలిపింది. దీంతో ఆగ్రహించిన క్యాబ్ డ్రైవర్ రోడ్డు మధ్యలో కారు ఆపి ఇద్దరిని బయటకు గెంటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.

Watch Video: భారత్‌ను కించపరిచిన పాకిస్థానీ.. బుద్ధి చెప్పిన క్యాబ్ డ్రైవర్
New Update

దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత్‌ను కించపరుస్తూ మాట్లాడిన ఓ పాకిస్థానీ, అతని ఇండియన్ గర్ల్ ఫ్రెండ్‌కు ఓ క్యాబ్ డ్రైవర్ తగిన బుద్ధి చెప్పాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన ఇండియన్ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఢిల్లీలో ఊబర్ కారులో వెళ్తున్నారు. అయితే దారిలో పాకస్థాన్ వ్యక్తి భారతీయులను అవమానపరిచేలా మాట్లాడారు. అతడి గర్ల్ ఫ్రెండ్ కూడా ఆ పాకిస్థాన్ వ్యక్తికి మద్దతు తెలిపింది. దీంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆగ్రహానికి గురయ్యాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ఇద్దరిని బయటకు గెంటేశాడు. ఆ తర్వాత వాళ్లని తమ గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు.

Also Read: సెబీ ఛైర్‌పర్సన్‌ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు : రాహుల్

దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ సంఘటనను భారతీయ గర్ల్ ఫ్రెండ్ వీడియో తీసింది. ఈ వ్యక్తి మమ్మల్ని అర్ధరాత్రి రోడ్డుపై వదిలేశాడని చెప్పింది. ఇది మోదీజీ ఇండియా అంటూ అతడితో వాదించింది. దీంతో ఇది హిందుస్థాన్ అంటూ ఆ క్యాబ్ డ్రైవర్  ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. మీరంతా హలాలా సంతానం అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి దేశభక్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అతడిని కూడా విమర్శిస్తున్నారు.

#telugu-news #delhi #national-news #pakisthan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe