Watch Video: భారత్‌ను కించపరిచిన పాకిస్థానీ.. బుద్ధి చెప్పిన క్యాబ్ డ్రైవర్ ఢిల్లీలోని ఓ క్యాబ్‌లో వెళ్తున్న ఓ పాకిస్థానీ భారత్‌ను కించపరుస్తూ మాట్లాడాడు. ఆ వ్యక్తితో పాటు ఉన్న ఇండియన్ గర్ల్‌ఫ్రెండ్ కూడా అతనికి మద్దతు తెలిపింది. దీంతో ఆగ్రహించిన క్యాబ్ డ్రైవర్ రోడ్డు మధ్యలో కారు ఆపి ఇద్దరిని బయటకు గెంటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. By B Aravind 12 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. భారత్‌ను కించపరుస్తూ మాట్లాడిన ఓ పాకిస్థానీ, అతని ఇండియన్ గర్ల్ ఫ్రెండ్‌కు ఓ క్యాబ్ డ్రైవర్ తగిన బుద్ధి చెప్పాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి.. తన ఇండియన్ గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి ఢిల్లీలో ఊబర్ కారులో వెళ్తున్నారు. అయితే దారిలో పాకస్థాన్ వ్యక్తి భారతీయులను అవమానపరిచేలా మాట్లాడారు. అతడి గర్ల్ ఫ్రెండ్ కూడా ఆ పాకిస్థాన్ వ్యక్తికి మద్దతు తెలిపింది. దీంతో ఆ క్యాబ్ డ్రైవర్ ఆగ్రహానికి గురయ్యాడు. రోడ్డు మధ్యలో కారు ఆపి ఇద్దరిని బయటకు గెంటేశాడు. ఆ తర్వాత వాళ్లని తమ గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు నిరాకరించాడు. Also Read: సెబీ ఛైర్‌పర్సన్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు : రాహుల్ దీంతో వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ సంఘటనను భారతీయ గర్ల్ ఫ్రెండ్ వీడియో తీసింది. ఈ వ్యక్తి మమ్మల్ని అర్ధరాత్రి రోడ్డుపై వదిలేశాడని చెప్పింది. ఇది మోదీజీ ఇండియా అంటూ అతడితో వాదించింది. దీంతో ఇది హిందుస్థాన్ అంటూ ఆ క్యాబ్ డ్రైవర్ ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. మీరంతా హలాలా సంతానం అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. అతడి దేశభక్తిని మెచ్చుకుంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అతడిని కూడా విమర్శిస్తున్నారు. Delhi: A Pakistani with his Indian Girlfriend was disparaging India. The Uber driver threw them both out after the Indian girl chose to support the Pakistani than the nation. We need more Drivers with spine like this 🫡 pic.twitter.com/4XqzNi0nGt — Arun Pudur (@arunpudur) August 11, 2024 #telugu-news #delhi #national-news #pakisthan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి