Delhi : ఢిల్లీలో ఆప్ (AAP) కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బీజేపీ (BJP) ఆఫీస్ ముట్టడికి ర్యాలీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఆప్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆప్ కార్యాలయం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆప్‌ను అంతం చేసేందుకు బీజేపీ కుట్రకు పాల్పడుతోందని సీఎం కేజ్రీవాల్ (Kejriwal) విమర్శించారు. అయితే కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్ట్‌కు నిరసనగా.. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు తమ పార్టీ నేతలతో బీజేపీ కార్యాలయానికి వస్తానని.. ఎంతమందిని అరెస్టు చేస్తారో చేయండి అంటూ శనివారం కేజ్రీవాల్ కేంద్రానికి సవాలు చేశారు. ఈ క్రమంలోనే ఈరోజు బీజేపీ ఆఫీస్‌కు ర్యాలీకి వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకుని కట్టడి చేస్తున్నారు.
Also read: ఇండియా కూటమిలో లుకలుకలు.. మమతా టార్గెట్‌గా కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు!