Police Raids In Kejriwal House : ఢిల్లీ (Delhi) సీఎం కేజ్రీవాల్ (Kejriwal) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇటీవలే జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ ఇంట్లో ఈ రోజు ఢిల్లీ పోలీసు బృందం సోదాలు నిర్వహించింది. ల్యాప్‌టాప్ & సీసీటీవీ డీవీఆర్ స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు కొన్ని కీలక పత్రాలను కేజ్రీవాల్ నివాసం నుంచి తీసుకెళ్లారు. లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా మే 25న ఢిల్లీకి ఓటింగ్ (Voting) జరగనున్న నేపథ్యంలో పోలీసులు ఈ చర్యకు పాల్పడటం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. స్వాతి మలివాల్‌పై దాడి కేసు పెద్ద చర్చనీయాంశంగా మారనుంది. అడిషనల్ డిసిపి, ఎస్‌హెచ్‌ఓ సివిల్ లైన్స్‌తో సహా ఢిల్లీ పోలీసు బృందం ఈరోజు ఆయన నివాసానికి ఎవిడెన్స్ బాక్స్‌తో వచ్చారు.
#WATCH | A team of Delhi Police including Additional DCP Anjitha Chepyala, SHO Civil Lines arrives at the residence of Delhi CM Arvind Kejriwal in connection with the AAP MP Swati Maliwal assault case.
Delhi Police yesterday arrested Delhi CM Arvind Kejriwal's aide Bibhav Kumar… pic.twitter.com/nGbMsxvXWl
— ANI (@ANI) May 19, 2024
Also Read : ఈరోజు స్టాక్ మార్కెట్ పనిచేయదు.. కొన్ని చోట్ల బ్యాంకులు కూడా.. ఎందుకంటే..