BREAKING: కవితకు షాక్.. కస్టడీ పొడిగింపు! ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ తగిలింది.. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. కోర్టు మాత్రం మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. By Trinath 23 Mar 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kavitha Custody Extended: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు కస్టడీ షాక్ తగిలింది.. ఇవాళ్టితో కవిత ఈడీ కస్టడీ ముగియగా అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. మరో ఐదు రోజుల కస్టడీకి ఈడీ కోరగా.. ఇరు వర్గాల వాదనను విన్న కోర్టు ఈడీ (ED) వాదనతో ఏకీభవించింది. అయితే ఐదు రోజులు కాకుండా మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. ఇది తప్పుడు కేసు అని కవిత లాయర్ వాదించారు. కవిత పిల్లలు మైనర్లు అని.. వారికి కలిసే అవకాశం ఇవ్వాలన్నారు లాయర్. ఇప్పటికే బెయిల్ పిటిషన్ వేశామన్నారు. కస్టడీ ముగింపు రోజే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలన్నారు కవిత లాయర్. మరోవైపు ఈడీ మాత్రం కవితని మరికొన్ని అంశాలపై ప్రశ్నించాల్సి ఉందని కోర్టులో చెప్పింది. ఇప్పటివరకు జరిగిన కస్టడీలో కవితను కిక్ బ్యాక్స్ గురించి ప్రశ్నించామని చెప్పింది. ఈ కేసులో వందల కోట్లు చేతులు మారాయని ఈడీ అంటోంది. ఈ విషయం గురించి మరింత లోతుగా ప్రశ్నలు అడగాల్సి ఉందని చెబుతోంది. నలుగురి స్టేట్మెంట్లను కవిత దగ్గర నుంచి అడిగామని కోర్టుకు చెప్పింది. డాక్టర్ చెప్పిన్నట్టుగానే కవితకు మందులు ఇస్తామని ఈడీ అంటోంది. సమీర్ మహేంద్రుతో కలిపి కవితను విచారించాల్సి ఉందని ఈడీ చెప్పింది. Also Read: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. తిరుగుబాటుకు సిద్ధమైన సిట్టింగ్ ఎంపీ? #mlc-kavitha #delhi-liquor-scam-case #kalvakuntla-kavitha #delhi-liquor-policy-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి