TS BJP: తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. తిరుగుబాటుకు సిద్ధమైన సిట్టింగ్ ఎంపీ? తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టికెట్ రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు.. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. దీంతో ఆయన పార్టీ మారుతారా? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? అన్న అంశంపై చర్చ సాగుతోంది. By Nikhil 23 Mar 2024 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి ఆదిలాబాద్ బీజేపీ (BJP) ఎంపీ సోయాం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి టికెట్ ఇవ్వకపోడంపై ఆయన పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. అయితే.. తాను పోటీ చేసే పార్టీ ఎదనేది తొందరలోనే వెల్లడిస్తానన్నారు. ముగ్గురు సిట్టింగ్ లకు మళ్లీ అవకాశం ఇచ్చిన హైకమాండ్.. తనకు మాత్రం టికెట్ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: Gruha Jyothi: సీఎం సొంత జిల్లాలోనే గృహజ్యోతి పథకానికి బ్రేక్..! టికెట్ ఇవ్వడం లేదని తనకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. గతేడాది ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసిన సోయం బాపూరావు విజయం సాధించారు. అయితే.. ఈ ఏడాది ఆయనకు అవకాశం దక్కలేదు. బీఆర్ఎస్ నుంచి వచ్చి పార్టీలో చేరిన గోడం నగేశ్ కు పార్టీ ఈ సారి టికెట్ కేటాయించింది. దీతో బాపూరావు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. దీంతో బాపూరావు నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. బీజేపీలో అసంతృప్తులకు అగ్రనేతలు బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. టికెట్ దక్కని వారికి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావుకు కూడా ఫోన్ వెళ్లినట్లు తెలిసింది. పార్టీ మారడంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని బీజేపీలోనే ఉండాలని కిషన్‌రెడ్డి కోరినట్లు సమాచారం. పార్టీ ఆఫీస్కొస్తే కూర్చుని మాట్లాడదామని కిషన్ రెడ్డి అడగగా.. ఆఫీసుకు రావడానికి సోయం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. #telangana-bjp #bjp-kishan-reddy #soyam-bapurao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి