Delhi High Court : ఆరేళ్ల పాటు మోదీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో ఆయన పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్‌ లో పేర్కొన్నారు.

Modi : నేడు ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం..ఆ పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు!
New Update

PM Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణలతో ఆయన పై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) లో పిటిషన్‌ దాఖలైంది. ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని అనర్హులుగా ప్రకటించాలని ఆ పిటిషన్‌ లో పేర్కొన్నారు. మోదీ పిలిభిత్‌ లో ఎన్నికల ప్రసంగంలో ప్రధాని మోదీ హిందూ దేవతలు, ప్రార్థనా స్థలాలతో పాటు సిక్కు దేవతల పేర్లను కూడా చేర్చి పార్టీకి ఓట్లు వేయాలని అడుగుతున్నట్లు సదరు పిటిషన్‌ లో పేర్కొన్నారు.

దీని గురించి సోమవారం హైకోర్టులో విచారణ జరగనుంది. మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఢిల్లీ హైకోర్టు న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్‌కు సూచించాలి అని తెలిపారు.

ఈ పిటిషన్‌లో ఏప్రిల్ 9వ తేదీన పిలిభిత్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగం గురించి తెలియజేశారు.అయితే, పిలిభిత్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ రామమందిరాన్ని(Ram Mandir) నిర్మించినట్లు చెప్పారని పిటిషనర్ పేర్కొన్నారు. కర్తాపూర్ సాహిబ్ కారిడార్ కూడా అభివృద్ధి చేసినట్లు ప్రచారం చేశారు.. గురుద్వారాలలో వడ్డించే లంగర్‌లో ఉపయోగించిన వస్తువులకు GST నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలు రెండు కులాలు లేదా వర్గాల మధ్య ఉద్రిక్తతను సృష్టించగలవని పిటిషనర్ అన్నారు.

ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశాం.. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని లాయర్ ఆనంద్ ఎస్ జోంధాలే వెల్లడించారు.

Also read: టైటానిక్ వాచ్ ఎన్ని వందల కోట్ల ధర పలికిందో తెలుసా!

#elections #loksabha #delhi #high-court #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe