Kavita : కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..

లిక్కర్‌ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. దీంతో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

New Update
MLC Kavitha: ఢిల్లీ ఎయిమ్స్‌కు కవిత.. కోర్టు కీలక ఆదేశాలు

High Court : లిక్కర్‌ కేసు(Liquor Case)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత బెయిల్ పిటిషన్‌(Kavitha Bail Petition) పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) లో విచారణ జరగనుంది. జస్టిస్‌ స్వర్ణకాంత్ శర్మ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేయనుంది. సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్‌ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత.. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.

Also Read: భారత్‌ చంద్రునిపై అడుగుపెట్టింది.. మన పిల్లలు మాత్రం.. : పాకిస్తాన్ ఎంపీ

దీంతో ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. మరోవైపు ఇటీవల లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌(Aravind Kejriwal) కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కవితకు కూడా ఢిల్లీ హైకోర్టులో బెయిల్ వస్తుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

Also read: రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై కీలక ఆదేశాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు