Delhi: కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ

ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి అతిశీ తెలిపారు. ఈ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

New Update
Delhi: కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ప్రత్యేక చట్టం: మంత్రి అతిశీ

ఢిల్లీలో ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ విషాద ఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి అతిశీ తెలిపారు. బుధవారం మీడియాతో ఆమె మాట్లాడారు. ఈ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వ అధికారులు, పలు కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఈ చట్టంలో మౌలిక వసతులు, టీచర్ల విద్యార్హత, కోచింగ్ ఫీజు, విద్యార్థులను తప్పుదోవ పట్టించే కోచింగ్ సెంటర్ల యాడ్స్‌కు సంబంధించిన రూల్స్ ఉంటాయని పేర్కొన్నారు. చట్ట రూపకల్పన కోసం ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు.

Also Read: వయనాడ్ నుంచి RTV లైవ్.. వరద విలయంపై EXCLUSIVE..

బిల్డింగ్‌ బేస్‌మెంట్ల విషయంలో కూడా రూల్స్‌ ఉల్లంఘించిన కోచింగ్ సెంటర్లపై ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (DMC) కఠిన చర్యలు తీసుకోనుందని తెలిపారు. ఇప్పటికే అలాంటి రూల్స్ ఉల్లంఘించిన 30 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశామన్నారు. మరో 200 కోచింగ్ సెంటర్లకు కూడా డీఎంసీ అధికారులు నోటీసులు పంపినట్లు తెలిపారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన రిపోర్టును ఆరు రోజుల్లోనే సమర్పిస్తామని.. ఇందులో మున్సిపల్ అధికారులు దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Also Read: గ్రీన్‌కార్డు హోల్డర్లకు… కేవలం మూడు వారాల్లోనే అమెరికా పౌరసత్వం!

Advertisment
Advertisment
తాజా కథనాలు