CM Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులు ఇచ్చారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందని కేజ్రీవాల్ గతంలో ఆరోపణలు చేశారు. జనవరి 27న సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఏడుగురు ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావించారు కేజ్రీవాల్. కేజ్రీవాల్ పోస్టులపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్‌లో బీజేపీ ఫిర్యాదు చేసింది. మూడ్రోజుల్లో సమాధానం చెప్పాలని కేజ్రివాల్‌కు క్రైమ్ బ్రాంచ్ గడువు ఇచ్చారు. ఈ ఆరోపణలకు సాక్ష్యాలేంటి అని ప్రశ్నించారు ఢిల్లీ పోలీసులు. ఈ క్రమంలో రేపు మంత్రి అతిషికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ALSO READ: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రెండు గ్యారెంటీలు అమలు?
బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు..
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) ని కూల్చేందుకు బీజేపీ(BJP) ప్రయత్నిస్తోందని అంటున్నారు. ఢిల్లీలో ఆపరేషన్ లోటస్‌కు బీజేపీ తెరతీస్తోందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నన్ను అరెస్ట్ చేయిస్తామని మా ఎమ్మెల్యేలను బీజేపీ బెదిరిస్తోంది. అప్పుడు ఆప్ ప్రభుత్వం కూలిపోతుందని… దాని తర్వాత బీజేపీ పార్టీ నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తామని ప్రలోభ పెడుతున్నారు. తమ ఎమ్మెల్యేలు 7గురిని బీజేపీ కొనడానికి చూసిందని కేజ్రీవాల్ అంటున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 25 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టిందని కేజ్రీవాల్ చెబుతున్నారు. ఇప్పటికే 21 మంది ఆప్ నేతలు తమ దగ్గర ఉన్నారని బీజేపీ చెబుతోందని కేజ్రీవాల్ అంటున్నారు.
కోర్టుకు ఈడీ...
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యవహారంపై కోర్టుకు వెళ్ళింది ఈడీ. లిక్కర్ స్కాం కేసులో విచారణకు రావాలని ఐదు సార్లు సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు పంపింది ఈడీ. అయితే.. కేజ్రీవాల్ మాత్రం ఈడీ నోటీసులను పక్కకు పెట్టి విచారణకు రాలేదు. మొత్తం ఐదు సార్లు కూడా విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టడంతో రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది ఈడీ.
DO WATCH: