Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ

బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్ష కోసం మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 19 వరకు కేజ్రీవాల్‌ జ్యుడిషియల్ కస్డడీని పొడిగించింది.

New Update
Kejriwal: 8.5కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. ఆందోళనలో ఆప్‌!

లోక్‌సభ ఎన్నికల్లో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. జూన్ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కేజ్రీవాల్.. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్ష కోసం మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ విచారణపై వాదనలు విన్న న్యాయస్థానం.. ఈరోజుకు వాయిదా వేసింది. తాజాగా ఈ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 19 వరకు కేజ్రీవాల్‌ జ్యుడిషియల్ కస్డడీని పొడిగించింది. ఆయన వైద్య అవసరాలను జైలు అధికారులు చూసుకోవాలని ఆదేశించింది.

Also Read: 56 అంగుళాల ఛాతి వీరుడు.. ఛాయ్‌వాలా టు హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అద్భుతాలు!

ఇదిలాఉండగా.. ఇటీవల జైలు నుంచి వచ్చాక కేజ్రీవాల్‌ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్నారు. వచ్చిరావడంతోనే బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. అమిత్ షా ప్రధాని అవుతారని.. యూపీ సీఎంగా యోగీ ఆదిత్యనాథ్‌ను తప్పిస్తారంటూ బాంబు పేల్చడం సంచలనం రేపింది. కేజ్రీవాల్‌ ఆరోపణలపై బీజేపీ కౌంటర్‌ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక లిక్కర్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: హీరో టూ జీరో.. ప్రధాని రేసు నుంచి పతనానికి కేసీఆర్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు