Delhi: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు-సునీత కేజ్రీవాల్

తన భర్త రాజకీయ కుట్రకు బలి అయ్యారని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్ భార్య సునీత ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలతో లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను అరె్ట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

New Update
Delhi: నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారు-సునీత కేజ్రీవాల్

Sunitha Kejriwal: టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేజీవాల్ను అరెస్ట్ చేశారు. అయితే తన కొడుకు రాఘవను కాపాడుకునేందుకు శ్రీనివాసులు తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని అంటున్నారు కేజ్రీవాల్ భార్య సునీత. మొదట ఎంపీని అరెస్ట్ చేశారు. తరువాత అతని కొడుకును కూడా అరెస్ట్ చేశారు. దీంతో అతను కొడుకును కాపాడుకోవడానికి తప్పుడు వాంగ్మూలం ఇచ్చారు. మద్యం వ్యాపారం కోసం కేజ్రీవాల్‌ని కలిశానని, అందుకోసం ఆమ్‌ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వాలని సీఎం అడిగారని చెప్పారు. ఎంపీ వాంగ్మూలం ఇచ్చిన మరుసటి రోజే అతడి కుమారుడు జైలు నుంచి విడుదలయ్యారు. తన భర్తను అన్యాయం అరెస్ట్ చేశారని ఆరోపించారు. తన భర్తకు మద్దతునివ్వాలని ఆమె ఢిల్లీ ప్రజను కోరారు. కేజ్రీవాల్‌ను రక్షించుకోకపోతే..భవిష్యత్తులో విద్యావంతులెవరూ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడరని సునీత అన్నారు.

మనీలాండరింగ్‌ కేసలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈయనపై దర్యాప్తు కొనసాుతోందని చెప్పింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసుతో పాటు సీబీఐ పిటిషన్‌ వేయడంతో కేజ్రీవాల్ జూలై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Also Read:Gujarath: గుజరాత్‌లో కూలిన భవనం..చిక్కుకున్న 15 మంది

Advertisment
తాజా కథనాలు