Delhi CM Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) ను ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో... సర్వేన్నత న్యాయస్థానంలో ఈరోజు అత్యవసర పిటిషన్ వేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈరోజు ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్(DY Chandrachud) ధర్మాసనం ముందు ఈ పిటిషన్ ప్రస్తావించడానికి కేజ్రీవాల్ తరుఫు న్యాయవాది వివేక్ జైన్ సిద్ధమయ్యారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు ధర్మాసనం స్వీకరిస్తుందా లేదా అనేది తెలియదు. దీనిపై ఆప్ శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది.
లిక్కర్ స్కాం కేసు(Liquor Scam Case) లో మార్చి 21వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అసలైన సూత్రధారని ఈడీ(ED) ఆరోపిస్తోంది. ఈడీ కస్టడీ తర్వాత కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15వరకు ఆయన తీహార్ జైల్లో ఉండనున్నారు.
కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టేసింది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. సీఎం అయినా, సామాన్యుడు అయినా న్యాయవిచారణ ఒకేలా జరుగుతుందని...దాన్ని విచారించాలో కోర్టును అతనేమీ చెప్పనక్కర్లేదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు అని కోర్టు వ్యాఖ్యానించింది.