CM Kejriwal: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెల రూ.1000.. సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన’ పథకం కింద 18 ఏళ్లు వయసు నిండిన మహిళలకు ప్రతి నెల రూ.1000 ఇస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రజలకు ఉచిత కరెంట్‌, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు.

New Update
BIG BREAKING: సీఎం కేజ్రీవాల్‌కు బిగ్ షాక్

CM Kejriwal: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆ రాష్ట్ర మహిళలపై వరాల జల్లు కురిపించారు. ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన’ పథకం కింద 18 ఏళ్లు వయసు నిండిన మహిళలకు ప్రతి నెల రూ.1000 ఇస్తామని ప్రకటించారు. తమ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం పని చేస్తోందని అన్నారు. ఒక్క అన్న లాగా మహిళలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. బీజేపీకి మద్దతు ఇచ్చే మహిళలకు ఇదే విషయం చెప్పాలని సభలో సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో ప్రజలకు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అంటే తమ పార్టీ ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని అన్నారు. త్వరలోనే ప్రతి నెలా మహిళలకు రూ.1000 ఆర్థిక సాయాన్ని అందిస్తామాని అన్నారు.

ALSO READ: లోక్ సభ ఎన్నికలు.. బీఆర్ఎస్‌తో పొత్తుకు బీఎస్పీ ఓకే!

మహిళకు బీజేపీ ఏం చేసింది..

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై మండిపడ్డారు సీఎం కేజ్రీవాల్. మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ఇస్తున్నామని చెప్పిన బీజేపీ పార్టీ.. ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. మహిళా సాధికారత పేరుతో బీజేపీ ఎన్నో మోసాలు చేసిందని ఆరోపించారు. పార్టీలో ముగ్గురు, నలుగురికి పదవులు ఇచ్చి దేశంలోని మహిళలకు అనేక పదవులు ఇచ్చి గౌరవించిన పార్టీ తమది అంటూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటాయని ఫైర్ అయ్యారు. ఇలాంటి పార్టీలకు ప్రజలు ఎందుకు ఓటు వెయ్యాలో ఆలోచించుకోవాలని అన్నారు.

మనీష్ సిసోడియా ఉంటే బాగుండేది..

ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను గుర్తు చేసుకున్న సీఎం కేజ్రీవాల్. గత పదేళ్ళుగా తమ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టమని.. అందులో తొమ్మిది మనీష్ సిసోడియా ప్రవేశ పెట్టారని అన్నారు. బీజేపీ పన్నిన కుట్రల్లో మనీష్ సిసోడియా జైలులో ఉన్నారని మండిపడ్డారు. కనీసం వచ్చే ఏడాది లోనైనా మనీష్ సిసోడియా అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశ పెడతారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు