ఉచిత కరెంట్... నిరుద్యోగ భృతి... ఓటర్లకు కేజ్రీవాల్ కీలక హామీలు..!

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే చత్తీస్ గఢ్ లోనూ అదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు

author-image
By G Ramu
New Update
CM Kejriwal: కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్.. సీబీఐకి నోటీసులు

చత్తీస్ గఢ్ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ(Aap) దృష్టి సారించింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆప్ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind kejriwal) చత్తీస్ గఢ్ లో పర్యటించారు. ఆయన తన పర్యటనలో భాగంగా రాష్ట్ర ఓటర్లకు పలు కీలక హామీలను(garentees) ఇచ్చారు.

రాజధాని రాయ్ పూర్ లోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీల్లో శనివారం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే చత్తీస్ గఢ్ లోనూ అదే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు.

ఈ రోజు తాను పది హామీలను ఇస్తున్నాని చెప్పారు. అవి ఫేక్ మెనిఫెస్టో లేదా సంకల్ప్ పాత్రలాగా వుండవన్నారు. కేజ్రీవాల్ చావనైనా చస్తాడు కానీ ప్రజల హామీలను నెరవేరుస్తాడన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 24 గంటలు నిరాంతరాయంగా విద్యుత్ అందిస్తామన్నారు. రాష్ట్రంలో కుటుంబాలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు.

ఈ ఏడాది నవంబర్ వరకు పెండింగ్ లో ఉన్న బిల్లులను మాఫీ చేస్తామన్నారు. 18 ఏండ్లు పైబడిన మహిళలకు సమ్మాన్ రాశి(గౌరవ వేతనం) కింద రూ. 1000 అందజేస్తామన్నారు. రాష్ట్రంలో స్కూల్ విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్యను అందజేస్తామన్నారు. ఢిల్లీలో ఇస్తున్నట్టుగానే రాష్ట్ర ప్రజలకు కూడా ఉచిత, నాణ్యమైన వైద్యాన్ని అందజేస్తామన్నారు.

నిరుద్యోగులకు నెలకు రూ. 3000 నిరుద్యోగ భృతి అందజేస్తామన్నారు. సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్రల పథకం అమలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామన్నారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసు, సైనిక కుటుంబాలకు రూ. కోటీ రూపాయల పరిహారాన్ని అంజేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు