Delhi : కేజ్రీవాల్‌కు షాక్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రికి మళ్ళీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆయన రిమాండ్‌ను పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏప్రిల్ 15వరకు రిమాండ్‌ను ఇచ్చింది. 

Delhi : కేజ్రీవాల్‌కు షాక్.. జ్యూడీషియల్ రిమాండ్ విధించిన కోర్టు
New Update

Judicial Remand : ఢిల్లీ ముఖ్యమంత్రికి మళ్ళీ షాక్ తగిలింది. కేజ్రీవాల్‌(Kejriwal) కు..రౌస్ ఎవెన్యూ కోర్టు లిక్కర్ కేసులో 15 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇవాల్టితో ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీ ముగిసింది. దీంతో ఈడీ(ED) అధికారులు ఆయనను కోర్టులో మరోసారి హాజరుపర్చారు. విచరాణ అనంతరం ఈ నెల 15 వరకు కేజ్రీవాల్‌కు  జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దాంతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు తనకు జైల్లో  ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని  కేజ్రీవాల్ కోర్టును కోరారు. ఇంటి నుంచి ఆహారం, భగవద్గీత, రామాయణం, మందులకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు. . సీఎం హోదాలో తీహార్ జైలు(Tihar Jail) కు వెళుతున్న మొదటి ముఖ్యమంత్రిగా సీఎం కేజ్రీవాల్ నిలిచారు. ఇప్పటికే ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లోనే ఉన్నారు.

#BREAKING : Delhi CM Arvind Kejriwal Remanded To Judicial Custody Till April 15 In Liquor Policy Case | @nupur_0111 #ArvindKejriwal #LiquorScam https://t.co/KS6KqSRMpM

— Live Law (@LiveLawIndia) April 1, 2024

ఇంకా విచారణ చేయాలి...

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు(Delhi Liquor Scam Case) లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు మార్చి 24న అరెస్ట్ చేశారు. ఇవాల్టితో ఆయన కస్టడీ ముగియడంతో అడీ అధికారులు కోర్టులో మరోసారి హాజరుపర్చారు. లిక్కర్ పాలసీ కేసు దర్యాపుతకు కేజ్రీవాల్ సహకరించడం లేదని...తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ సమాధానలు చెబుతున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. అంతేకాదు కేజ్రీవాల్ తన మొబైల్, ల్యాప్ ట్యాప్ వంటి పరికారాల పాస్‌వర్డ్‌లను కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పింది. ఆయనను ఇంకా విచారించే అవసరం ఉందని పేర్కొంది. కేజ్రీవాల్ అన్నింటికీ నాకు తెలియదు అనే సమాధానమే చెబుతున్నారని ఈడీ అధికారులు చెప్పారు. ఈడీ వాదనలను విన్నకోర్టు కేజ్రీవాల్‌కు ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

Also Read : Stock Markets : మొదలైన కొత్త ఆర్ధిక సంవత్సరం.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

#aravind-kejriwal #tihar-jail #delhi-liquor-scam #rouse-avenue-court
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe