Kejriwal : తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

తీహార్‌ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. దాంతో పాటూ ఆయనను రేపు ట్రయల్ కోర్టులో హజరు పరిచేందుకు కూడా సీబీఐకు అనుతి లభించింది. రేపు సీబీఐ కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చనుంది.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?

CBI : అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కేసులో కీలక పరిణామం చోటు చేసకుంది. సుప్రీంకోర్టు (Supreme Court) లో కేజ్రీవాల్ బెయిల్ పిటషన్ మీద విచారణ జరిగే ముందు సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుని విచారించింది. దాంతో పాటూ కేజ్రీవాల్‌ను ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు కూడా సీబీఐకు అనుమతి లభించింది. రేపు కేజ్రీవాల్‌ను సీబీఐ ట్రయల్ కోర్టులో హాజరుపర్చనుంది.

అంతకు ముందు లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case) లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ కేసులో ఇటీవల కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ వేసిన పిటిషన్ పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ట్రయల్ కోర్ట్ రికార్డులు పరిశీలించకుండానే బెయిల్ ఇచ్చారన్న హైకోర్టు తెలిపింది. బెయిల్‌పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులోనే ఉన్నారు కేజ్రీవాల్. రేపు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌ బెయిల్‌పై విచారణ జరగనుంది.

రేపు సుప్రీంకోర్టులో విచారణ ఉండగా ఇప్పుడు ఆయనను సీబీఐ అదుపులోకి తీసుకోవడంపై ఆప్ నేతలు మండిపడుతుననారు. బీజేపీ, సీబీఐ కుమ్మక్కైందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కావాలనే కేజ్రీవాల్‌ను అణగదొక్కడానికే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థను తారుమారు చేస్తున్నారని, కేజ్రీవాల్‌ను అన్యాయంగా నిర్భందించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Also Read:National: లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ

Advertisment
Advertisment
తాజా కథనాలు