Viral Video: వరద బీభత్సం.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ..!

ఉత్తరాఖండ్‌లో దంచికొడుతున్న వర్షాలకు బిల్డింగులు కూలిపోతున్నాయి. డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం కొంతభాగం కూలిపోవడానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 17వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌పై వరుణుడు మరోసారి పగబట్టాడు. నదులు ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి.

Viral Video: వరద బీభత్సం.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ..!
New Update

Caught on camera-Dehradun Defence College collapses in heavy rain in Uttarakhand : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పదులు సంఖ్యలో మరణాలు సంభవించగా.. తీరని నష్టం వాటిల్లింది. కొండ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో డెహ్రాడూన్(Dehradun) డిఫెన్స్ కాలేజీ భవనంలో కొంత భాగం కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు డెహ్రాడూన్, నైనిటాల్ సహా ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలో వరుణుడు విరుచుకుపడుతున్నాడు. గంటల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో కుమ్మరించేస్తున్నాడు. భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు ముంచెత్తడంతో..లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మండిలో బియాస్‌ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. తీర ప్రాంతం కోతకు గురవడంతో ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. బండరాళ్ల కింద పడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌, నైనిటాల్‌ సహా 6 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ్లి(ఆగస్టు 14) నుంచి ఆగస్టు 17 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు 60మంది మృతి చెందగా..17మంది గల్లంతయ్యారు.



హిమాచల్‌ప్రదేశ్‌పై వరుణుడి పగ:

మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో మళ్లీ వరదలు ముంచెత్తుతున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. పంటలు నీటమునిగాయి. ఊళ్లకు ఊళ్లే జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌గా, మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది వాతావరణ శాఖ. అటు కొండ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆకస్మిక వరదలకు రోడ్లు మూసివేశారు. హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పూర్ జిల్లాలోని దకేష్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిని క్లోజ్‌ చేశారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, రాత్రిపూట ప్రయాణాలు వ‌ద్దని స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు. అటు వరద ధాటికి సిమ్లాలోని ఓ శివాలయం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏకంగా 9 మంది మృతి చెందినట్టు ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. సావన్ సందర్భంగా ప్రార్థనలు చేసేందుకు భక్తులు తరలివచ్చారు. ప్రమాద సమయంలో దాదాపు 50 మంది శివాలయంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. కొండచరియలు విరిగిపడి శివాలయంపై పడడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.

#floods #uttarakhand-floods #rains #himachal-pradesh-floods
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe