Viral Video: వరద బీభత్సం.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ..!
ఉత్తరాఖండ్‌లో దంచికొడుతున్న వర్షాలకు బిల్డింగులు కూలిపోతున్నాయి. డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజీ భవనం కొంతభాగం కూలిపోవడానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నెల 17వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఉత్తరాఖండ్‌లోని ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అటు హిమాచల్‌ప్రదేశ్‌పై వరుణుడు మరోసారి పగబట్టాడు. నదులు ఉగ్రరూపం దాల్చడంతో రోడ్లన్నీ కొట్టుకుపోతున్నాయి.