Deepika Padukone: దీపికకు అరుదైన గౌరవం.. అందులో ఆమె టాప్‌!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోనే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తాజాగా పాపులర్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎమ్‌డీబీ గత పదేళ్ల కాలంలో టాప్‌ 100 మోస్ట్‌ వ్యూవ్డ్‌ ఇండియన్‌ స్టార్స్‌’ పేరుతో ఓ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో దీపికా పదుకొనే తొలి స్థానంలో నిలిచింది.

Deepika Padukone: దీపికకు అరుదైన గౌరవం.. అందులో ఆమె టాప్‌!
New Update

Deepika Padukone : బాలీవుడ్ (Bollywood), టాలీవుడ్ (Tollywood), హాలీవుడ్ (Hollywood) ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది నటి దీపికా పదుకొనే (Deepika Padukone). మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దీపికా.. ఆ తర్వాత ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. నటన, అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది ఈ బ్యూటీ.

మోస్ట్‌ వ్యూవ్డ్‌ ఇండియన్‌ స్టార్ గా దీపికా

అయితే తాజాగా దీపికా ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. పాపులర్ ఎంటటైన్మెంట్ పోర్టల్ ఐఎమ్‌డీబీ(IMDb) గత పదేళ్లలో అత్యధికంగా వీక్షించబడిన టాప్ 100 భారతీయ సినీ తారల జాబితాను విడుదల చేసింది. ఈ  టాప్‌ 100 మోస్ట్‌ వ్యూవ్డ్‌ ఇండియన్‌ స్టార్స్‌ జాబితాలో దీపీకా పదుకొనే మొదటి స్థానంలో నిలిచింది. గత పదేళ్లలో అనేక మంది అగ్ర తారలను అధిగమించి దీపికా మొదటి స్థానం సొంతం చేసుకోవడం విశేషం. ఈ సందర్భంగా దీపికా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంత మంది ప్రేమను పొందడం ఆనందంగా ఉందని పేర్కొంది.

ప్రస్తుతం దీపికా.. ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కల్కిలో ప్రధాన పాత్రలో కనిపించనుంది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం  జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో పాటు 'సింగం అగైన్' మూవీ కూడా చేస్తోంది. ఈ మూవీ నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Deepika Padukone: నేడు దీపికా పదుకోణె బర్త్ డే.. సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ - Rtvlive.com

#bollywood #tollywood #hollywood #most-viewed-indian-stars #deepika-padukone
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe