SBI Clerk Recruitment: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.. ఇంకా రెండు రోజులే గడువు

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI)లో ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు అలర్డ్. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలు ఉండగా ఈ జాబ్స్ కోసం ఆన్ లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ డిసెంబర్ 7 మరో రెండు రోజులే మిగిలివుంది.

SBI Clerk Recruitment: ఎస్‌బీఐలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా.. ఇంకా రెండు రోజులే గడువు
New Update

SBI Clerk Recruitment : ఎస్‌బీఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అలర్ట్. అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ఖాళీలు కలిపి జూనియర్‌ అసోసియేట్‌, కస్టమర్‌ సపోర్ట్‌ & సేల్స్‌ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇటీవల భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు అప్లై చేసుకునేందుకు మరో రెండు రోజులే మిగిలివుంది. దీంతో చివరి రోజు టెక్నికల్ ఇష్యూ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో బుధవారం సాయంత్రంలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.

ఈ మేరకు ఎస్‌బీఐలోని వివిధ సర్కిళ్లలో మొత్తం 8,773 (రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ఖాళీలు కలిపి) జూనియర్‌ అసోసియేట్‌ (కస్టమర్‌ సపోర్ట్‌ & సేల్స్‌) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 600 ఖాళీలు ఉండగా.. డిగ్రీ అర్హతతో భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరీ, మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షతో పాటు పాటు స్థానిక భాష పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అయితే అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్‌ 7 చివరి తేది.

ఇక అర్హతలు, వేతనం, వయో పరిమితి, పరీక్ష కేంద్రాలు తదితర వివరాల ఇలా ఉన్నాయి. అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్‌/ చివరి సెమిస్టర్‌ వారూ అర్హులే. ఉద్యోగానికి అప్లై చేసుకునే వాళ్లు 2023 ఏప్రిల్‌ 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపు ఉంది. ఇక పరీక్ష ఆన్‌లైన్‌లో ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష జనవరిలో, మెయిన్‌ పరీక్ష ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్ష ఇంగ్లీష్‌, హిందీతో పాటు స్థానిక భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్ష తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, ఉర్దూ భాషల్లో రాసుకునే వెసులుబాటు కల్పించారు.

Also read :AP Govt Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హత కలిగిన వారికి గుడ్ న్యూస్.. 256 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/దివ్యాంగ ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుం చెల్లించనవసరం లేదు. జనరల్‌/ ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు మాత్రం రూ.750 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు పూర్తి చేయడం, ఫీజు చెల్లింపు తదితర ఇబ్బందులేవైనా వస్తే 022 22820427 నంబర్‌ను కాంటాక్టు చేయొచ్చు. బ్యాంకు పనివేళల్లో ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు కాంటాక్టు చేయొచ్చు. ఏవైనా సందేహాలుంటే  https://bank.sbi/web/careers/current-openings లోనూ ఫిర్యాదు చేయవచ్చు.

అలాగే ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులు, మెయిన్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఒక తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/మత సంబంధిత మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ప్రీ ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు 6 మాసాల పాటు ప్రొబేషన్‌ ఉంటుంది.
బేసిక్‌ వేతనం: రూ. 19,900 నుంచి మొదలవుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్ : అనంతపురం, భీమవరం, చీరాల, గూడూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, నెల్లూరు, రాజమండ్రి, రాజంపేట, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణ: హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌.

పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

#sbi #jobs #sbi-clerk #sbi-clerk-recruitment-2023
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe