Navalny Death : నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాస్తున్నారు..

నావల్నీ మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఆయన మృతదేహాన్ని కావాలనే దాస్తున్నారని.. మరణానికి దారితీసిన ఆధారాలను శరీరంలో నుంచి బయటపడకుండా జాగ్రత్తపడేందుకు అలా చేస్తున్నట్లు నావల్ని మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.

New Update
Navalny: నావల్నీ మృతిపై కీలక అప్‌డేట్‌.. ఆయన తల, ఛాతిపై కమిలిన గాయాలు..!

Alexei Navalny : రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin) ప్రత్యర్థి, విపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny) జైల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే నావల్నీ మృతదేహాన్ని తీసుకోవడానికి ఆయన తల్లి లియుడ్మిలా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన మరణ వార్త తెలిసినత తర్వాత ఆమె ఆర్కిటిక్‌ పీనల్ కాలనీలో ఉన్న జైలుకు వెళ్లారు. కానీ అప్పటికే మృతదేహాన్ని సలేఖార్డ్‌ అనే నగరానికి తరలించినట్లు అక్కడి అధికారులు చెప్పారు. మరో విషయం ఏంటంటే ప్రాథమిక శవపరీక్షలో ఎలాంటి ఫలితం కూడా తేలలేదని.. రెండోసారి శవపరీక్ష చేయాల్సి ఉంటుందని.. అక్కడి అధికారులు తెలిపారని.. నావల్నీకి చెందిన అధికార ప్రతినిధి కీరా యూర్మిష్‌ పేర్కొన్నారు.

Also Read : పాకిస్థాన్ ప్రధానమంత్రి ఆయనే.. నిర్ణయం వెనుక సైన్యం హస్తం

కావాలనే దాస్తున్నారు

మరోవైపు నావల్నీ మృతదేహాన్ని కావాలనే దాస్తున్నారని ఆయన మద్దతుదారులు ఆరోపణలు చేస్తున్నారు. మరణానికి దారితీసిన ఆధారాలను శరీరంలో నుంచి బయటపడకుండా అలా చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. అయితే నావల్నీ ఆర్కిటిక్‌ పీనల్ కాలనీ(Arctic Penal Colony) లో చనిపోయారని అధికారులు ఆయన తల్లికి సమాచారం ఇచ్చారు. సడెన్‌ డెత్‌ సిండ్రోమ్ వల్లే ఆయన మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణిస్తే సడెన్‌ డెత్‌ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తారు.

పుతిన్‌ బాధ్యత వహించాల్సి ఉంటుంది 

నావల్నీకి నివాళులర్పించిన 100 మందిని రష్యా పోలీసులు శనివారం అరెస్టు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఆయన మృతిపై అమెరికా, కెనడా, యూకేతో పాటు పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. నావల్ని హత్య వెనుక ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ హస్తం ఉందని ఆరోపణలు చేశాయి. నావల్నీ మరణంపై ఆయన భార్య యులియా అనుమానం వ్యక్తం చేశారు ఆ అనుమానం గనుగ పుతిన్‌, ఆయన అనుచరులు శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. పుతిన్ నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని నమ్మలేమని.. ఆరోపణలు రుజువైతే నా దేశానికి, నా కుటుంబానికి చేసిన అన్యాయానికి.. పుతిన్‌, ఆయన పరివారం బాధ్యత వహించాల్సి ఉంటుందని.. ఆ రోజు త్వరలోనే వస్తుందని ధ్వజమెత్తారు.

Also Read : నావల్ని మరణానికి పుతినే బాధ్యుడు.. బైడెన్ సంచలన ఆరోపణలు..

Advertisment
తాజా కథనాలు