Team India : గుడ్ బై..గబ్బర్ షాకింగ్ నిర్ణయం టీమిండియాకి ఊహించని షాక్ తగిలింది. క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ ప్రకటించాడు. గత కొంత కాలంగా టీమిండియాలో ఆడేందుకు అవకాశం రాకపోవడంతో ధావన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. By Bhavana 24 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Shikhar Dhawan Announces Retirement Of Cricket Team : టీమిండియా (Team India) క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టుకు ఓ స్టార్ ప్లేయర్ దూరం అవుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. దీని గురించి సోషల్ మీడియా (Social Media) లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఇంటర్నేషనల్ , అలాగే డొమెస్టిక్ క్రికెట్ లో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో ద్వారా శిఖర్ తెలిపాడు. భారత్ తరుఫున ఆడినందుకు చాలా గర్వంగా ఉందని..శిఖర్ వివరించాడు. తన ప్రయాణంలో తనకు ఎంతో మంది సాయం చేశారని…వారి వల్ల జీవితంలో ఆటలో ఈ స్థాయికి వచ్చానని వివరించారు. అయితే టీమిండియాలో గత కొన్ని రోజులుగా శిఖర్ ధావన్ కు అవకాశం రాలేదు. దీంతో అసంతృప్తి చెందిన శిఖర్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు శిఖర్ కెరీర్ లో టీమిండియా తరఫున 34 టెస్టులు ఆడాడు. అలాగే టీ20 లు 68 ఆడాడు. వన్డే మ్యాచ్ లు 167 ఆడాడు. Also Read: కౌలాలంపూర్‌లో మురుగు కాల్వలో పడి కుప్పం మహిళ గల్లంతు! #cricket #shikhar-dhawan #team-india #retirement మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి