Afghanistan : భారీ వరదలు.. 300 మందికి పైగా మృతి అఫ్ఘానిస్తాన్‌లో అకస్మిక వరదలు సంభవించాయి. కుండపోత వర్షాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఉత్తర అఫ్ఘానిస్తాన్‌లో చాలాప్రాంతాలు నీటమునిగాయి. భారీ వరదల ధాటికి 300 మందికి పైగా మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. By B Aravind 12 May 2024 in ఇంటర్నేషనల్ వాతావరణం New Update షేర్ చేయండి Heavy Rains : అఫ్ఘానిస్తాన్(Afghanistan) లో అకస్మిక వరదలు సంభవించాయి. కుండపోత వర్షాలకు(Rains) ఒక్కసారిగా వరద పోటెత్తింది. ఉత్తర అఫ్ఘానిస్తాన్‌లో చాలాప్రాంతాలు నీటమునిగాయి. భారీ వరదల ధాటికి 300 మందికి పైగా మృతి చెందారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో మరికొందరు గల్లంతయ్యారు. బాగ్లాన్ ప్రావీన్స్‌లో భారీగా వర్షపాతం నమోదైంది. ఇళ్లు ధ్వంసమైపోయాయి. వాహనాలు కోట్టుకపోయాయి. ఇళ్లన్ని బురదమయం అవ్వడంతో.. తాగేందుకు నీరు(Drinking Water), తినడానికి తిండి(Eating Food) లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి.. సొంతూళ్లకు పయనం పలు వీధుల్లో చిన్నారులు ఏడుస్తూ కనిపిస్తున్న హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగతున్నాయి. వరదల ప్రభావానికి భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగడం కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. Also read: ఓటు వేయడంలో ఎనీ డౌట్.. అన్నిటికీ సమాధానం ఇక్కడ ఉంది! The UN Food Program has confirmed that the death toll in #Afghanistan has been increased to 300 due to the flash floods caused by the heavy seasonal rains. #UNFoodProgram said the torrential rain and devastating floods also battered north and northwestern Afghanistan.… pic.twitter.com/ODAY8Zb52Y — DD News (@DDNewslive) May 12, 2024 #afghanistan #heavy-rains #floods మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి