Darsi MLA Maddisetty Venugopal: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది పార్టీల్లో జంప్ జిలానీలు ఎక్కువ అవుతున్నారు. టికెట్లు రాక అసంతృప్తుల్లో ఉన్నవారు నెమ్మదిగా పక్క పార్టీల్లోకి జారుకుంటున్నారు. తాజాగా వైసీపీని (YCP) వీడే ఆలోచనలో మరో ఎమ్మెల్యే ఉన్నట్టు తెలుస్తోంది. ఒంగోలు ఎమ్మెల్యే మద్దశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరుడు శ్రీధర్ పార్టీని వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినట్టు సమాచారం. సీఎం బస్సు యాత్రకు దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఆయన సోదరుడు శ్రీధర్ డుమ్మా కొట్టాడానికి కారణం అదేనని చెబుతున్నారు. దాంతో పాటూ ఒకటి రెండ్రోజుల్లో టీడీపీలోకి (TDP) వెళ్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.
టీడీపీలోకి మద్ధిశెట్టి సోదరులు...
మద్దిశెట్టి, ఆయన సోదరుడు చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇప్పటికే దర్శి నియోజకవర్గంలో సొంత కేడర్ మెయింటైన్ చేస్తున్న మద్దిశెట్టి బ్రదర్స్...ఇప్పుడు 2024 దర్శి ఎన్నికల్లో మరోసారి చక్రం తిప్పేందుకు వ్యూహం పన్నుతున్నారని తెలుస్తోంది. ఇక్కడ వైసీపీ ప్రకటించిన అభ్యర్ధి బూచేపల్లికి, ఎమ్మెల్యే మద్దిశెట్టికి మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడుసిట్టింగ్ ఎమ్మెల్యే మద్ధిశెట్టిని కాదని బూచేపల్లికి అవకాశమిచ్చింది వైసీపీ అధిష్టానం. దీంతో ఆయన చాలా కోపంగా, అసంతృప్తిగా ఉన్నరని...అందుకే పార్టీ మారి వైసీపీకి చెక్ పెట్టాలని అనుకుంటున్నారని చెబుతున్నారు.
సిద్ధానికి డుమ్మా...
తనకు టికెట్ ప్రకటించనప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు, నియోజకవర్గానికి మద్దిశెట్టి సోదరులు దూరంగా ఉంటున్నారు. తాజాగా జగన్ సిద్ధం బస్సు యాత్రలో కూడా అన్నదమ్ములిద్దరూ పాల్గొనలేదు. దీని ద్వారా ఇప్పటికే పార్టీకి తాము తూరం అవుతున్నామని ప్రకటించేశారని...ఇప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళిపోవడమే మిగిలి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read:Telangana: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకిల్ కొడుకు అరెస్టు..