Karnataka: కన్నడ నటుడు దర్శన్‌కు షాక్..కస్టడీ పొడిగింపు ఫ్యాన్ రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో అరెస్ట్ చేసిన కన్నడ హీరో దర్శన్‌కు కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. రేపు ఆదివారం కావడంతో దర్శ్‌ను పోలీసులు ఒకరోజు ముందుగానే కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు తొమ్మిది రోజులు అడిగారు కానీ కోర్టు ఐదు రోజులకే పర్మిషన్ ఇచ్చింది. By Manogna alamuru 15 Jun 2024 in క్రైం టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hero Darshan: చిత్రదుర్గవాసి రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు, దర్శకుడు దర్శన్, పవిత్రా గౌడ్, మరి కొందరిని పోలీసులు గత మంగళవారం అరెస్ట్ చేశారు. ఆ తరువాత వారికి ఆరు రోజుల కస్టడీ విధించారు. రేపు ఆదివారంతో అది ముగియనుండగా...ఇప్పుడు కోర్టు నిందితులకు మరో ఐదు రోజుల కస్టడీని పొడిగించారు. రేపు ఆదివారం కావడంతో పోలీసులు వారిని ఈరోజు కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు 15 మంది నిందితులు అన్నపూర్ణేశ్వర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. దర్శన్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. కన్నడ హీరో దర్శన్ చుట్టూ కేసు ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ అయిన 13మంది కాక మరో ఆరుగురిని పోలీసులు నిందితులుగా తేల్చారు. ఇంకొకరు పరారీలో ఉన్నారు. నటుడు దర్శన్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఏమీ ఇవ్వడం లేదని..అందరిలానే అతనిని ట్రీట్ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే హత్యకు ముందుగా ఏమీ ప్లాన్ చేసుకోలేదని..అశ్లీల దృశ్యాలు పంపించాడని కోపంతో కొట్టామని...దాని వలనే మరణించాడని దర్శన్ చెబుతున్నారని చెప్పారు. అయితే నిందితుల నుంచి ఫోన్లు తాము జప్తు చేసుకున్నామని...కానీ వాటిల్లో వాట్సాప్ మెసేజ్‌లు, ఫోటోలు డిలీట్ చేశారని తెలిపారు. దర్శన్ నిందితులకు ఇచ్చిన 30లక్షలను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. Also Read:T20 World Cup: ఇండియా, కెనడా మ్యాచ్ రద్దు #murder-case #hero-darshan #karnataka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి