Bangladesh: నిరసన పేరుతో విధ్వంసం సృష్టించారు..మౌనం వీడిన షేక్ హసీనా

తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టిన తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మొట్ట మొదటిసారి మాట్లాడారు. నిరసనల పేరుతో బంగ్లాలో విధ్వంసాన్ని సృష్టించారన్నారు. ఆగస్టు 15న దేశంలో సంతాప దినాన్ని గౌరవప్రదంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు.

New Update
Bangladesh: షేక్ హసీనాకు షాకిచ్చిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

EX Prime Minister Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన మౌనాన్ని వీడారు. అల్లర్లు, రాజీనామా, దేశాన్ని విడిచిపెట్టడం..ఇలా ఇన్ని జరిగినా ఆమె ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటి సారిగా తన కుమారుడి ఎక్స్ సోషల్ మీడియా ద్వారా ఆమె బంగ్లాదేశ్ ప్రజలు సందేశాన్ని పంపారు. మూడు పేజీల భావోద్వేగ ప్రకటనను చేశారు.

మొట్టమొదటగా 1975లో ఆగస్టు 15న తన తండ్రితో పాటూ ఇతర కుటుంబ సభ్యులను కోల్పోయిన విషయాన్ని షేక్ హసీనా గుర్తు చేసుకున్నారు. ఆ రోజు తన తండ్రిని హత్య చేశారని...దాంతో పాటూ ఆయన కుమారులు వారి కుటుంబం, సైన్యం అంతా తుడిచి పెట్టుకుపోయారని గుర్తు చేసుకున్నారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు అయిన తన తండ్రి షేక్ ముజిబుర్ రహమాన్ ను చంపిన ఆగస్టు 15న జాతీయ సంతాపదినంగా చేసుకోవాలని ఆమె బంగాలీలకు పిలుపునిచ్చారు. జాతీయ సంతాప దినాన్ని గౌరవప్రదంగా.. గంభీరంగా జరుపుకోవాలని చెప్పారు. బంగబంధు భాబన్‌లో పూల దండలు సమర్పించి ప్రార్థించాలని కోరారు.

ఇక తాజాగా అల్లర్ల గురించి కూడా షేక్ హసీనా సోషల్ మీడియా పోస్ట్‌లో ప్రస్తావించారు. ఈ అల్లర్లలో తన తండ్రి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. నిరసనల పేరుతో దేశంలో అల్లకల్లోలం సృష్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో పోలీసులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, సామాన్య ప్రజలు, అవామీ లీగ్ నేతలు ఇలా చాలా మంది చనిపోయారు. వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు షేక్ హసీనా. ఈ విధ్వంసంలో పాల్గొన్న వారి మీద విచారణలు జరిపి..తగిన విధంగా శిక్షించాలని ఆమె కోరారు. తమ ఇంటిని విధ్వంసం చేశారు. దాన్ని ఒక చెత్త కుప్పగా తయారు చేశారు. అది మాకు ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఈ చర్యను ముజీబుర్ రహమాన్ పట్ల చూపిన అవమానంగా ఆమె అభివర్ణించారు. ఇది కచ్చితంగా స్వాతంత్ర సమరయోధులను అపవిత్రం చేయడమేనని షేక్ హసీనా అన్నారు. దీనికి న్యాయం చేయాలని నా దేశ ప్రజలను కోరుతున్నాను అంటూ సందేశంలో రాసుకొచ్చారు.

షేక్ హసీనా మీద కేసు నమోదు...

మరోవైపు బంగ్లాదేశ్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనా మీద హత్య కేసు నమోదు అయింది. ఆమెతో పాటూ మరో ఆరుగురు పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లో జరిగిన అల్లర్లలో ఓ కిరాణ దుకాణ యజమాని అబుసయ్యద్‌ అనే వ్యక్తి మరణించాడు. అతడి మరణానికి మాజీ ప్రధాని షేక్‌ హసీనానే కారణమని ఆరోపిస్తూ సయ్యద్‌ బంధువుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెతో పాటు మరో ఆరుగురిపైనా పోలీసులు
కేసు నమోదు చేశారు. నిందితుల్లో అవామీ లీగ్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ ఒబైదుల్‌ క్వాడర్‌, మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ కమల్‌, మాజీ ఐజీ అబ్దుల్లా అల్‌ మామున్‌ సహా మరికొందరు ఉన్నారు.

Also Read: Andhra Pradesh:మంత్రులందరికీ ఐప్యాడ్లు… ఇకపై ఈ-క్యాబినెట్ సమావేశాలు

Advertisment
తాజా కథనాలు