Uttar Pradesh: దారుణం.. దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు యూపీలో అమానుష సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ ముగ్గురిని అరెస్టు చేశారు. By B Aravind 12 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి ఉత్తరప్రదేశ్‌లో మరోసారి అమానుష సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు ఓ దళిత యువకుడిని కొట్టి బలవంతంగా మూత్రం తాగించారు. బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆ ముగ్గురు అరెస్టయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని శ్రావస్తి జిల్లాలో 15 ఏళ్ల దళిత యువకుడు, అతడి కుటుంబం గ్రామంలో డిజే నిర్వహిస్తోంది. వివిధ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో సౌండ్, ఆడియో సిస్టమ్‌లను ఏర్పాటు చేస్తారు. అయితే ఆ యువకుడు మంగళవారం రాత్రి ఓ వేడుకలో డీజే పెట్టాడు. Also read: పూజాకు షాక్..! ఆరోపణలు నిజమని తేలితే.. ఊడనున్న ఉద్యోగం జనరేటర్‌లో ఇంధనం అయిపోవడంతో డీజే ఆపేశాడు. అదనంగా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ముగ్గురు వ్యక్తులు అతడితో ఘర్షణకు దిగారు. కార్యక్రమం తర్వాత ఇంటికి వెళ్తున్న యువకుడిని వాళ్లు అడ్డుకొని చితకబాదారు. బాటిల్‌లో మూత్రం పోసి బలవంతంగా అతడితో మూత్రం తాగించారు. అంతేకాదు ఈ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంటికి చేరుకున్నాక ఆ యువకుడు జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. తర్వాతి రోజు అతని తల్లిదండ్రులు, సోదరుడు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు.. దిలీప్ మిశ్రా, సత్యం తివారీ, కిషన్ తివారీని గురువారం అరెస్టు చేశారు. దిలప్ మిశ్రా మద్యం బాటిల్‌లో మూత్రం విసర్జన చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇక కిషన్ తివారీ, సత్యం తివారి ఇద్దరూ కలిసి ఆ యువకుడి నోటి వద్ద బాటిల్ పెట్టి బలవంతంగా మూత్రం తాగించారని పేర్కొన్నారు. Also Read: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. ఆ రోజును ‘సంవిధాన్ హత్యా దివస్’గా! #uttar-pradesh #dalit-man #urine #crime #dj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి