Lemon Grass : నిమ్మగడ్డితో ఎన్నో లాభాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఆయుర్వేదంలో నిమ్మగడ్డికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌‌ లెవల్స్‌ తో పాటు దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. దీనిని తీసుకుంటే చర్మ ఆరోగ్యం, ముఖంపై ముడతలు పోయి వృద్ధాప్య ఛాయలు తగ్గి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

Lemon Grass : నిమ్మగడ్డితో ఎన్నో లాభాలు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
New Update

Lemon Grass Benefits : ప్రస్తుత కాలంలో లెమన్ గ్రాస్ (Lemon Grass) అంటే చాలామందికి తెలియదు. కానీ ఆయుర్వేదంలో నిమ్మగడ్డి (లెమన్‌గ్రాస్‌)కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ గడ్డికి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందట. నిమ్మగడ్డిని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఎంతో ఫేమస్‌ అవుతున్న లెమన్‌ గ్రాస్‌తో టీ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ గడ్డిలో సువాసనలు వెదజల్లే ఏరోమాటిక్ ఎసెన్షియల్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కతో సూప్స్, కూరలు, టీ చేసుకుని తీసుకుంటే ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు (Health Benefits) ఉంటాయి. నిమ్మగడ్డితో ఇంక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మగడ్డి తీసుకుంటే కలిగే లాభాలు:

  • నిమ్మగడ్డిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌‌ లెవల్స్‌, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్, వాపు తగ్గేలా చేస్తుంది.
  • నిమ్మగడ్డిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ తీసుకుంటే శరీరంలో రోగనిరోధకశక్తి (Immune Power) అధికంగా పెరుగుతుంది. దీంతో వ్యాధులు, రోగాలు, సీజనల్‌ సమస్యలు దరి చేరకుండా ఉంటారు.
  • చాలామంది పని, ఇతర కారణాల వల్ల ఒత్తిడి- ఆందోళనలకు గురైతారు. అలాంటి వారు నిమ్మగడ్డి తీసుకుంటే ఈ సమస్య తగ్గి రిలాక్సేషన్‌ ఉంటుంది. నిమ్మగడ్డి సువాసన పీల్చినా మనసుకు ప్రశాతంగా ఉంటుంది.
  • నిమ్మగడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకుంటే చర్మ ఆరోగ్యం మెరుగుపడి ముఖంపై ఉండే ముడతలు పోతాయి. ప్రతి రోజూ దీనిని గ్రాస్ తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు రాకుండా.. చర్మం కాంతివంతంగా ఉంటుదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read : ఖమ్మంకు మరో ముప్పు.. 3 రోజులు గండమే!

#health-benefits #ayurvedic #lemon-grass-benefits
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe