మిచౌంగ్‌ ఎఫెక్ట్‌ భారీగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు!

ఏపీలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావం కూరగాయల ధరల మీద ప్రభావం చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.

New Update
మిచౌంగ్‌ ఎఫెక్ట్‌ భారీగా పెరిగిన టమాటా, ఉల్లి ధరలు!

ఏపీలో మిచౌంగ్‌ తుఫాన్‌ అల్లకల్లోలం సృష్టిస్తుంది. తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్‌ తీరాన్ని దాటిని తరువాత వాయుగుండం బలహీన పడుతుందని వాతావరణశాఖాధికారులు తెలిపారు.దాని వల్ల పంటలన్ని నీట మునిగాయి.

దీంతో మరోసారి కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు చెన్నై మహానగరం కూడా నీట మునిగిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు ఐదు పది రూపాయాలు మాత్రమే ఉన్న టమాటా ధరలు తుఫాన్‌ ప్రభావంతో ఒక్కసారిగా భారీగా పెరిగాయి.

ఇది కేవలం ఆస్పరి టమోటా మార్కెట్‌ లో మాత్రమే ఉంది. ఇలా మిచౌంగ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌ కు ఇక్కడ టమాటా ధరలు పెరగడానికి చెన్నై నుంచి టమాటా దిగుమతి కావడమే ఇందుకు కారణం. మంగళవారం నాడు కర్నూలు రైతు బజార్‌ లో కిలో 14 రూపాయలు ఉండగా.. పత్తికొండ, ప్యాపిలి మార్కెట్లలో ధరలు సాధారణ స్థితిలోనే ఉన్నాయి.

కానీ మిచౌంగ్‌ ఎఫెక్ట్‌ తో ధరలు ఒక్కసారిగా పైకి వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. దీపావళి సమయంలో కిలో ఉల్లిపాయల ధర రూ.30 లు ఉండగా..ప్రస్తుతం రూ.80 కి చేరుకుంది. గతంలో టమాటా ధరలు హడలెత్తించాయి. కాగా తాజాగా ఉల్లి ధరలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ఉల్లి రైతులు కూడా ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.

తుఫాన్‌ తీవ్ర తరం అవుతున్న నేపథ్యంలో దివిసీమ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తీరం వెంబడి మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని, వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మిచౌంగ్‌ తుఫాన్‌ ఏపీలో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో రాష్ట్రంలో తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

తుఫాన్ పరిస్థితులు గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు- కావలి మధ్య సగం ల్యాండ్‌ ఫాల్‌,సగం సముద్రంలో ఉందని అధికారులు సీఎంకి వివరించారు. చీరాల బాపట్ల మధ్య పయనించి అక్కడ మధ్యాహ్నం 2.30 గంటలకు తీరం దాటనున్నట్లు అధికారులు వివరించారు.

తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావం మంగళవారం ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని అధికారులు తెలిపారు. తిరుపతి,. నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేశామన్నారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మంది ఉన్నారని వెల్లడించారు.

వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నెల్లూరు, తిరుపతి సహా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు.

Also read: తుఫాన్‌ సహాయ కార్యక్రమాలపై అధికారులతో ఏపీ సీఎం జగన్‌ భేటీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు