Watermelon: కట్ చేసిన పుచ్చకాయను ఎన్ని రోజులు తినవచ్చు?.. ఈ తప్పు చేయకండి వేసవిలో ప్రజలు అత్యంత జ్యుసీ, తియ్యగా ఉండే పుచ్చకాయను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో ఉండే అనేక పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కట్ చేసిన పుచ్చకాయను చల్లని ప్రదేశంలో ఉంటుంది కాబట్టి దాని రుచి పోతుంది. ఫ్రిడ్జ్ లో మూడు రోజులకు మించితే తినకుండా ఉంటేనే ఉత్తమం అంటున్నారు. By Vijaya Nimma 21 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Watermelon: వేసవి కాలం వచ్చిందంటే మార్కెట్‌లో పుచ్చకాయల విక్రయాలు మొదలవుతాయి. ప్రజలు ఏడాది పొడవునా పుచ్చకాయ కోసం ఎదురుచూస్తుంటారు. వేసవిలో ప్రజలు అత్యంత జ్యుసీ, తియ్యగా ఉండే పుచ్చకాయను తినేందుకు ఇష్టపడుతుంటారు. ఇందులో ఉండే అనేక పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కానీ పుచ్చకాయను కట్ చేసిన తర్వాత దాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని సమయం దొరికినప్పుల్లా తింటుంటారు. ఇలా తినడం మంచిదేనా ఒక సారి కట్ చేసిన తర్వాత పుచ్చకాయ ఎన్ని రోజులు నిల్వ ఉంటుందనే సందేహాలు అందరికీ వస్తుంటుంది. పుచ్చకాయ ప్రయోజనాలు: పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. ఇది శరీరంలోని నీటి లోపాన్ని తీరుస్తుంది. పుచ్చకాయలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి ఇది బరువును తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా రక్తపోటు, ఎముకలు, దంత సమస్యలు, కంటి సమస్యలు, కండరాల సమస్యలకు బాగా పనిచేస్తుంది. క్యాన్సర్ వంటి వ్యాధులకు పుచ్చకాయ ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయలో ఉండే పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కట్ చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది..? చాలా మంది మిగిలిన పుచ్చకాయను సగానికి కట్ చేసి కొన్ని రోజుల తర్వాత తింటారు. పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల దాని ఖచ్చితమైన తేదీని చెప్పడం కొంచెం కష్టమే. కానీ పుచ్చకాయను కోసిన వెంటనే తినేయాలి. మొత్తం పుచ్చకాయను ఒకేసారి తినలేకపోతే దానిని చల్లని ప్రదేశంలో ఉంచాలి. సాధారణంగా ఇది 3 నుంచి 4 రోజులు ఉంటుంది. ఎందుకంటే చల్లని ప్రదేశంలో ఉంటుంది కాబట్టి పాడుకాదు. కానీ ఆ తర్వాత దాని రుచి పోతుంది. మూడు రోజులకు మించితే తినకుండా ఉంటేనే ఉత్తమం అని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: కప్పు పెసరపప్పులో ఎంత ప్రొటీన్ ఉంటుంది?..అనేక వ్యాధులు దూరం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #health-care #watermelon #best-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి