Crocodile: నగరంలోని చింతల్ బస్తీలో మొసలి కలకలం హైదరాబాద్‌లో మొసళ్లు బయటపడుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కరిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం దాటికి కడ్తాబాగ్‌లో భారీ వరద వచ్చింది. ఈ వదరల్లో ఓ మొసలి పిల్ల రావడం ఇప్పుడు అందరినీ బయాందోళనకు గురి చేస్తోంది. By Karthik 27 Sep 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లో మొసళ్లు బయటపడుతున్నాయి. నగరంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కరిసింది. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం దాటికి కచింతల్ బస్తీలో భారీ వరద వచ్చింది. ఈ వదరల్లో ఓ మొసలి పిల్ల రావడం ఇప్పుడు అందరినీ బయాందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా చింతల్ బస్తీ వాసులు రోడ్డు మీదకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కనపడ్డది ఒక్కటే కానీ ఇంక నీటిలో ఎన్ని మొసళ్లు ఉన్నాయో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్ మహానగరంలో కొద్ది సేపటి క్రితం భారీ వర్షం దంచి కొట్టింది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్డులన్నీ జలమయమయ్యాయి. ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌సుక్ నగర్, మలక్ పేట, చార్మినార్, బేగంపేట, అమీర్ పేట, కూకట్ పల్లి, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. మరోవైపు సిటీ శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడింది నగరంలో ముఖ్యమంగా సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట,చింతల్, జగద్గిరిగుట్ట, శంషాబాద్, రాజేంద్రనగర్, నారాయణగూడ, హైటెక్ సిటీ, మల్కాజిగిరి, ఉప్పల్, లకిడికపూల్, అబిడ్స్, గోషామహల్, నాంపల్లి, కోఠి తదితర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే రెడ్ అలర్ట్ ఇష్యూడ్ ఫర్ హైదరాబాద్ అంటూ తెలంగాణ వెదర్ మ్యాన్ ట్వీట్ చేశారు. ఉప్పల్ వైపు వెళ్లే రోడ్లన్నీ జలమయం అయ్యాయి. తార్నకలోని పలు చోట్ల భారీ వాన కురుస్తోంది. వాహన రాకపోకలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా ,తెలంగాణకు 3 రోజులు వర్షాలు వర్షాలు కురుస్తాయని..హైదరాబాద్ వాతవరణ శాఖ ముందుగానే అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. #heavy-rain #hyderabad #flood #staff #panic #ghmc #crocodile #cuddabad #locals మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి