/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cs-jpg.webp)
CS Santhi Kumari Review On Election Code: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలుపై పోలీసుశాఖ, ఇతర విభాగాల అధికారులతో సమీక్ష జరిపారు. బేగంపేట, శంషాబాద్ విమానాశ్రయాల్లో తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్మగ్లర్లు ఉపయోగించే రహస్య మార్గాలపై నిఘా పెంచాలని తెలిపారు. నగదు అక్రమ రవాణా, ఇతర అంశాలపై కూడా రాష్ట్రాలను అధికారులతో సమావేశం నిర్వహించినట్లు సీఎస్‌కు డీజీపీ రవి గుప్తా సీఎస్‌కు వివరించారు.
Also Read: సన్న బ్లేడ్లతో నన్ను ఏసేయాలని చూస్తున్నారు.. పవన్ షాకింగ్ కామెంట్స్!
85 సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పుట చేశామని.. ఫ్లెయింగ్ స్క్వాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. గత 15 రోజుల్లో దాదాపు రూ.35 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాణిజ్య పన్నుల కమిషనర్ మాట్లాడుతూ.. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద రూ.519 కోట్లు స్వాధీనం చేసుకున్నామని సీఎస్‌కు వివరించారు. అలాగే పరిశ్రమలు, గోదాములపై నిఘా పెంచామని చెప్పారు.