CS Santhi Kumari : తెలంగాణ(Telangana) లో అభయ హస్తం(Abhaya Hastham), ప్రజాపాలన(Praja Palana) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తోంది రేవంత్(Revanth Reddy) ప్రభుత్వం. అందుకు తగ్గట్టే జిల్లా కలెక్టర్లకు, అదికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల విషయంలోనే శ్రద్ధ పెట్టింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తు ఫామ్‌లను తీసుకుంటారు. వీటి డేటా ఎంట్రీ ని వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(CS Santhi Kumari) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ నెల 17లోగా మొత్తం డేటా ఎంట్రీ అయిపోవాలని చెప్పారు. 6వ తేదీన ప్రజావాణి ముగిసిన వెంటనే దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు. మండల రెవెన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు.
Also read:బీఆర్ఎస్ కు రేవంత్ సర్కార్ షాక్.. తెలంగాణ భవన్ కు రెవెన్యూ శాఖ నోటీసులు!
ఇక డేటా ఎంట్రీ కోసం 4, 5 తేదీల్లో అధికారులకు, కలెక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. బీమా దరఖాస్తుల డేటా ఎంట్రీ(Data Entry) ని 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పూర్తి చేయాలి. డేటా ఎంట్రీలో ఆధార్ నంబర్, తెల్ల రేషన్ కార్డు(Ration Cards) ను ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ పనుల్నీ సక్రమంగా జరగడానికి డీటీపీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని… అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లను నియమించుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. ఈ మొత్తం పనిని ప్రజా పరిపాలన కార్యక్రమానికి పర్యవేక్షక అధికారిగా ఉన్న జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని ఆదేశించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఐదు ప్రత్యేక పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత, యువ వికాసం పథకాలు ఉన్నాయి. ఒక్కో పథకానికి విడివిడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా, ఏ పథకానికి అర్హులైన వారు దరఖాస్తు ఫారమ్‌లో ఆ పథకానికి అవసరమైన వివరాలను మాత్రమే నింపాలి. అన్ని పథకాలకు సంబంధించిన నిలువు వరుసలు ఒకే రూపంలో ఇవ్వబడ్డాయి. దరఖాస్తు ఫారంతో పాటు రేషన్ కార్డు జతచేయాలి. దీంతో పాటూ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీలు, దరఖాస్తుదారు ఫోటోగ్రాఫ్ జతచేయాల్సి ఉంటుంది.