Manipur: మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. జవాన్ మృతి

మణిపుర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో సాయుధ దుండగులు జరిపిన దాడుల్లో సీఆర్పీఎఫ్ జవాన్‌ మృతి చెందారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. జులై 13న అక్కడ కాల్పులు జరగడంతో దీనికి సంబంధించి ఆదివారం సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి.

New Update
Manipur: మణిపూర్‌లో మరోసారి కాల్పులు.. జవాన్ మృతి

మణిపూర్‌లోని జిరిబామ్‌ జిల్లాలో మరోసారి సాయుధ దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) జవాన్ మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. జిరిబామ్‌లో సీఆర్పీఎస్‌, పోలీసు బృందాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. జులై 13న అక్కడ కాల్పులు జరగడంతో దీనికి సంబంధించి ఆదివారం సెర్చ్‌ ఆపరేషన్ నిర్వహించాయి. ఉదయం 9.40 గంటల సమయంలో కొందరు గుర్తుతెలియని సాయుధులు జవాన్లపై దాడులకు పాల్పడ్డారు. దీంతో దుండగులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

Also Read: తెరుచుకున్న పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం

ఈ కాల్పుల్లో బీహార్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ అజయ్ కుమార్ ఝాగా (43) ప్రాణాలు కోల్పోయారు. ఇక జిరిబామ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన ఎస్సైతో సహా ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఇదిలాఉండగా.. శుక్రవారం ఇంఫాల్‌లో ఖుయాథోంగ్, నాగమపాల్‌ ప్రాంతాల్లో భద్రతా దళాలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో ఉగ్రస్థావరాలను గుర్తించారు. ఇక్కడ మందుగుండు సామగ్రితో పాటు ఎక్స్‌కాలిబర్‌ రైపిల్‌, ఒక MA-3 MK-II రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: అమర్‌నాథ్ యాత్రకు పోటెత్తిన భక్తులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు