Crime : కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ.. కారు డ్రైవర్‌ మీదే అనుమానం!

జూబ్లీహిల్స్‌ లో కోటి విలువైన వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. బాధితులను విమానాశ్రయం నుంచి ఇంటికి తీసుకుని వచ్చిన కారు డ్రైవర్‌ మీదే అనుమానం వ్యక్తం అవుతుంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

New Update
Crime : కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ.. కారు డ్రైవర్‌ మీదే అనుమానం!

Hyderabad : తెలంగాణ(Telangana) లో కోటి రూపాయల విలువైన వజ్రాభరణాలు చోరీకి గురైన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌ లోని రోడ్డునెంబర్‌–71లోని నవనిర్మాణ్‌ నగర్‌లో నివసించే బాబ్జీ భాగవతుల అనే విశ్రాంత ఉద్యోగి తన భార్య తో కలిసి ఈ నెల 20న బెంగుళూరు నుంచి విమానంలో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌(Shamshabad Airport) కు వచ్చాడు.

అక్కడ ట్యాక్సీ మాట్లాడుకుని జూబ్లీహిల్స్‌ లోని తన ఇంటికి బయలుదేరాడు. దారి మధ్యలో ఫిలింఛాంబర్‌(Film Chamber) ఎదురుగా ఉన్న విజేత సూపర్‌ మార్కెట్‌ వద్ద ట్యాక్సీ డ్రైవర్‌ కారును ఆపి శుభ్రం చేసుకున్నాడు. కొద్దిసేపటికి బాబ్జీని , ఆయన భార్యను ఇంటి వద్ద దింపడమే కాకుండా కారు డిక్కీలో ఉన్న రెండు సూట్‌కేసులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు.

కాగా.. ఈ నెల 24న సాయంత్రం బాబ్జీ ఆయన సూట్‌ కేసుల్లో ఉన్న నగలను జాగ్రత్త చేసేందుకు చూడగా అందులో ఉండాల్సిన నగల బాక్స్‌ కనిపించలేదు. ఆ నగల పెట్టెలో మూడు వజ్రాల హారాలు(Diamonds Heist), మూడు జతల వజ్రాల చెవి రింగులు ఉన్నాయని, వీటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని బాబ్జీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

ట్యాక్సీ డ్రైవర్‌పై అనుమానం ఉందని, కారును ఆపినప్పుడు డిక్కీలో నుంచి వాటిని తీసేసి ఉంటాడని, లేదా ఇంట్లోకి సూట్‌కేసులు తెచ్చే సమయంలో అయినా జ్యువెలరీ బాక్స్‌ను చోరీ చేసి ఉండవచ్చునని బాబ్జీ పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విమానాశ్రయంలో ఆ సమయంలో ట్యాక్సీ ఎవరు బుక్‌ చేశారు, దాని నెంబర్‌ తదితర వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also read: కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు!

Advertisment
తాజా కథనాలు