Yediyurappa May Be Arrested: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు యడియూరప్ప 17 ఏళ్ల బాలికను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయనపై పోక్సో కేసు (POCSO Case) నమోదైంది. ఈ కేసుపై విచారణ చేస్తున్న సీఐడీ (CID) కూడా నిన్న(బుధవారం) ఆయనకు నోటీసులు పంపించింది. తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. కానీ దీనికి యెడియూరప్పు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఆయన్ని అరెస్టు చేసేందుకు సీఐడీ స్పేషల్ కోర్టును ఆశ్రయించింది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న యడియూరప్ప.. బెంగళూరుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also read: మాజీ సీఎం కేసీఆర్‌కు ఈడీ బిగ్ షాక్
మరోవైపు తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కోరుతూ యెడియూరప్ప బుధవారం హైకోర్టును (High Court) ఆశ్రయించారు. కానీ దీనిపై ఇంకా కోర్టులో విచారణ జరగలేదు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 17 ఏళ్ల బాలికపై యెడియూరప్ప అసభ్యంగా ప్రవర్తించి, లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ బాలిక తల్లి మార్చి 14న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అయితే మార్చి 15న దీనిపై యడియూరప్ప స్పందించారు. ' ఓ మహిళ నాపై కేసు ఫైల్ చేసినట్లు తెలిసింది. నెల రోజులు గడిచిపోయాయి. వాళ్లు నన్ను కలవడానికి వస్తుండేవారు. నేను పట్టించుకోలేదు. ఒకరోజు.. వాళ్లు ఏడుస్తున్నారని తెలియడంతో వాళ్లకి ఫోన్ చేశాను. ఏమైందని అడిగాను. తమకు అన్యాయం జరిగినట్లు వాళ్లు చెప్పారు. దీంతో నేను పోలీసు కమిషనర్‌కి ఫోన్ చేసి.. వాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు చేయండని చెప్పాను.ఆ తర్వాత ఆ మహిళ తనకు వ్యతిరేకంగా మాట్లడటం మొదలుపెట్టింది. ఆమెకు ఆరోగ్యం బాలేదేమోనని అనుకున్నాను. దీనిపై విచారణ చేయాలని పోలీస్ కమీషనర్‌కు చెప్పాను. ఇప్పుడు చివరికి నాపైనే ఎఫ్‌ఐఆర్ నమోదైందని' యెడియూరప్ప చెప్పారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఆయన్ని అరెస్టు చేసేందుకు సీఐడీ తాజాగా స్పెషల్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.