విశాఖపట్నంలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. డిగ్రీ విద్యార్థి అనుమానస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందడడం తీవ్ర సంచలనం రేపింది. అయితే అతడి మృతికి కాలేజీ లెక్చరర్ల లైంగిక వేధింపులే కారణమని విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
MVP Student Suicide
21 ఏళ్ల సాయి తేజ MVP కాలనీలోని సమత కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడు ఇవాళ ఉదయం తన ఇంట్లో విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. సాయితేజ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్‌కు తరలించారు.
ఇక సాయితేజ మరణ వార్త విన్న తోటి స్నేహితులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాలేజీ వద్దకు పరుగులు తీసిన విద్యార్థులు.. సాయి తేజను కొంత మంది లేడీ లెక్చరర్లు లైంగికంగా వేధించారని.. వారి వేధింపులు తట్టుకోలేక సాయి తేజ మనస్థాపానికి గురై సూసైడ్ చేసుకున్నాడంటూ తోటి స్నేహితులు కాలేజీ వద్ద ఆందోళన చేపట్టారు.
గత కొన్ని రోజుల నుంచి వేధింపులు మొదలయ్యాయని.. అవి ఈ మధ్య మరింత పెరిగాయని ఆరోపించారు. అలా ఎక్కువ కావడంతో సాయి తేజ ఈ నిర్ణయం తీసుకున్నాడని.. ఈ అన్యాయానికి పాల్పడిన లెక్చరర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కాలేజీ బయట ఆందోళనకు దిగారు. అందిన సమాచారం ప్రకారం.. సాయి తేజను ఇద్దరు మహిళా లెక్చరర్లు లైంగికంగా వేధించారని.. తరచూ అసభ్యకర మెసేజ్‌లు, వీడియోలు పంపించి వేధించారని తెలుస్తోంది.
వారి వేధింపులు తాళలేక సాయి తేజ ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. స్టూడెంట్ల ఆందోళనతో కాలేజీ పరిసర ప్రాంతమంతా ఒక్కసారిగా వేడెక్కింది. వెంటనే ఎంవీపీ పోలీసులు రంగంలోకి దిగి.. ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Follow Us