BIG BREAKING: పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాదం.. ఐదుగురు పరిస్థితి!

పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విష వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

పరవాడ ఫార్మా సిటీలో భారీ ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విష వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విష వాయువు లీక్ కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. విష వాయువు అంతటా వ్యాపిస్తే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని భయపడుతున్నారు. ఈ విష వాయువు లీక్ కావడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు. అయితే రసాయన రియాక్టర్ల నుంచి ఈ లీక్ జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. రసాయన ట్యాంకుల్లో నిర్వహణ లోపాల వల్ల లేదా సాంకేతిక సమస్యల వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:Heavy Rains: ముంచుకొచ్చిన భారీ వరదలు.. 252 మృతి చెందగా.. 3 వేల మందికి పైగా..!

కార్మికుల పరిస్థితి

విష వాయువు లీక్ అయిన సమయంలో అక్కడ కార్మికులు ఉండటంతో ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. దీనివల్ల వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. ఎక్కువగా తల తిరగడం, కళ్లు మంటలు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే ఆ కార్మికులను అక్కడ నుంచి స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఐదుగురిలో ప్రస్తుతం నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుటుంబ సభ్యులు వీరి ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్నారు. అయితే పరవాడ ఫార్మా సిటీలో విష వాయువులు లీక్ కావడం ఇదేం మొదటిసారి కాదు. ఎప్పటికప్పుడు ఇక్కడ విష వాయులు లీక్ అవుతుంటాయి. ఇలాంటి ప్రమాదాలు జరగడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఈ విష వాయువులు గాలిలో కలిసి ఆ తర్వాత పిల్చినా కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని స్థానిక ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు పీల్చితే వారికి చిన్నతనం నుంచే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని భయపడుతున్నారు.

ఇది కూడా చూడండి: Dharmasthala: ధర్మస్థల తవ్వకాల్లో సంచలనం.. 11వ స్పాట్లో ఏం దొరికాయో తెలుసా?

ఈ ఏడాదిలో పరవాడ ఫార్మా సిటీలోని టాగోర్ ఫార్మా లాబొరేటరీస్లో విష వాయువు లీక్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా చర్యలు పాటించలేదని ఆరోపణలు వచ్చాయి. అలాగే జూన్‌లో సాయి శ్రేయం ఫార్మాస్యూటికల్ అనే కంపెనీలో విష వాయువు లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు చనిపోగా, మరొకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో హైడ్రోజన్ సల్ఫైడ్ అనే వాయువు లీక్ అయినట్లు అనుమానించారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు కూడా భద్రతా ప్రమాణాల పట్ల నిర్లక్ష్యం వహించారని ఆరోపణలు వినిపించాయి.

Advertisment
తాజా కథనాలు