Crime: ఇది భార్య కాదు బద్మాష్‌.. ప్రియుడికోసం CRPF జవాన్‌నే లేపేసింది!

యూపీలో దారుణం జరిగింది. ప్రస్తుతం రైల్వే జాబ్ చేస్తున్న మాజీ జవాన్ దీపక్‌ను భార్య శివాని చంపేసింది. శ్రీరామనవమి రోజే ఆహారంలో నిద్రమాత్రలు వేసి గొంతుపిసికి హతమార్చింది. ఉద్యోగం కోసమా లేక ప్రియుడికోసం ఇలా చేసిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. 

New Update
up murder case

up murder case Photograph: (up murder case)

Crime: యూపీలో మరో దారుణం జరిగింది. బిజ్నూర్‌లో ఉద్యోగం కోసం భర్తను లేపేసింది ఓ భార్య. ఆహారంలో మత్తు మందు కలిపి చంపేసింది. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు గుండెపోటుతో చనిపోయాడంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో అసలు విషయం బయటపడగా వివాహేతర సంబంధం కూడా ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

మాజీ CRPF జవాన్..

ఉత్తరప్రదేశ్ ముక్రంద్‌పూర్ గ్రామానికి చెందిన మాజీ CRPF జవాన్ దీపక్ నజీబాబాద్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే ప్రస్తుతం రైల్వే ఉద్యోగం చేస్తున్న దీపక్.. గతేడాది చౌహర్‌పూర్ నహ్తౌర్‌కు చెందిన శివానీని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఆరు నెలల కొడుకు ఉన్నాడు. అయితే ఈ శ్రీరామనవమి రోజు దీపక్ తన ఇంట్లో పూజ చేస్తుండగా సృహతప్పి పడిపోయాడు. దీంతో దీపక్‌ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. ఆయనకు గుండెపోటు వచ్చిందని భార్య శివానీ ప్రచారం చేసింది. కానీ దీపక్ కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Read: Bigg Boss 9: కింగ్‌కు రెస్ట్.. బరిలోకి బాలయ్య- బిగ్ బాస్ 9 ఫుల్ కంటెస్టెంట్ లిస్ట్ ఇదే..

ఈ క్రమంలో దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. భార్య శివానిని ప్రశ్నించారు. శ్రీరామనవమి రోజు దీపక్‌కు తినే ఆహారంలో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి ఇచ్చినట్లు అంగీకరించింది. ఆయన సృహ కోల్పోగానే గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకుంది. ఈ హత్యలో మరొక వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు కుటుంబసభ్యులు, పోలీసులు అనుమానిస్తున్నారు. మార్చి 2023లో రైల్వేలో చేరిన దీపక్ గతంలో మణిపూర్‌లోని CRPFలో పనిచేసినట్లు ఆయన పేరెంట్స్ తెలిపారు. 

Also Read: Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..! 

uttarapradesh | wife-killed-husband

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు