ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అల్మోరా జిల్లాలో 42 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ రోడ్డు ప్రమాదంలో 22 మందికి పైగా మృతి చెందగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. గర్వాల్ నుంచి రాంనగర్‌కు వెళ్తున్న బస్సు అల్మోరా దగ్గర అదుపు తప్పింది.
ఇది కూడా చూడండి: ఏపీలో ఫించన్‌దారులకు బంపర్ ఆఫర్.. మూడు నెలల పెన్సన్ ఒకేసారి!
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంకా మృతులు సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కలర్ సింగ్ ధామి కూడా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారిని రక్షించాలని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇది కూడా చూడండి: ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరుతో రూ.25 కోట్లు స్వాహా
ఇదిలా ఉండగా.. తాజాగా తిరుపతి జిల్లా తిరుచానూరులోని శిల్పారామంలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా ఎంజాయ్ చేద్దామని ఎక్కిన క్రాస్ వీల్ ఓ యువతి ప్రాణం తీసింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుపతికి చెందిన లోకేశ్వరి అనే యువతి ఆదివారం సెలవు కావడంతో తన స్నేహితురాలికి కలిసి సరదాగా బయటకు వెళ్లింది. ఈ క్రమంలో శిల్పారామం వెళ్లగా.. అక్కడ ఉన్న క్రాస్ వీల్ ఎక్కారు. ఆ వీల్ తిరుగుతుండగా లోకేశ్వరి, తన స్నేహితురాలు కూర్చున్న సీటు ఒక్కసారిగా ఊడింది.
ఇది కూడా చూడండి: నేడు కార్తీక సోమవారం.. శివుడిని ఎలా పూజించాలంటే?
దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి పడటంతో లోకేశ్వరి అక్కడిక్కడే మృతి చెందింది. తన స్నేహితురాలు తీవ్ర గాయాలతో బయటపడింది. గాయపడిన అమ్మాయిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ సీట్‌లో ఒకరే కూర్చోవాలి. కానీ ఇద్దరు కూర్చోవడంతో తుప్పు పట్టిన సీటు ఒక్కసారిగా ఊడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీని నిర్వాహకుడు ప్రభాకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: విషాదం.. గొంతులో కోడి గుడ్డు ఇరుక్కుని..