రష్మిక పుష్ప2 BTS ఫోటోలను పంచుకుంది. ఈ సినిమా, అలాగే టీమ్ తో వ్యక్తిగతంగా కూడా కనెక్ట్ కావడం చాలా మనోహరంగా ఉందని పేర్కొంది.
రష్మిక ఫొటోలను షేర్ చేస్తూ.. హీరో అల్లు అర్జున్, సుకుమార్ తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
సుకుమార్ గురించి చెబుతూ.. సుక్కు సార్ తో ఏం మాట్లాడాలో తెలియని స్థితి నుంచి ఆయనతో ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాను అని తెలిపింది.
అల్లు అర్జున్ గురించి చెబుతూ.. మొదట్లో అల్లు అర్జున్ సార్ తో మాట్లాడడానికి కూడా చాలా భయపడ్డాను.. కానీ ఇప్పుడు అతనితో మంచి స్నేహం ఏర్పడింది.
2021 లో నా పుష్ప జర్నీ ప్రారంభమైంది. కోవిడ్ సమయంలో చిత్తూరు యాసలో శిక్షణ ఇవ్వడానికి టీమ్ మా ఇంటికి రావడం నాకు గుర్తుంది. అంటూ ఆ జ్ఞాపకాలను గుర్తుచేసింది.
పుష్ప మేకర్స్ గురించి మాట్లాడుతూ.. నాకు మైత్రి అంటే చాలా ఇష్టం.. ఈ వ్యక్తులు నాకు చాలా ఇష్టం.. నాకు చాలా ఎక్కువ అని తెలిపింది.
పుష్ప టీమ్ గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేస్తారు.. కానీ విజయం మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల వస్తుంది. పుష్ప దానికి సరైన ఉదాహరణ అంటూ పుష్పతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకుంది రష్మిక.