డెడ్‌బాడీని నెయ్యితో కాల్చిన యువతి.. ఓ చిన్న తప్పుతో పోలీసులకు దొరికిపోయింది

21ఏళ్ల అమృత చౌహన్ ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థిని. ఆమె ఎక్స్ లవర్‌తో కలిసి లివిన్ రిలేషన్‌లో ఉన్న రామకేశ్ మీనా(32)ని హత్య చేసింది. ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థిని కాబట్టి పక్కా ప్లాన్‌తో ఆ హత్యని ప్రమాదంగా చిత్రీకరించింది.

New Update
Forensics student

ఆమె ఓ కన్నింగ్ కంత్రీ లేడీ.. చదువుకున్న చదువుని బాయ్‌ఫ్రెండ్‌ని చంపి తప్పించుకోడానికి వాడింది. 21ఏళ్ల అమృత చౌహన్ ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థిని. ఆమె ఎక్స్ లవర్‌తో కలిసి లివిన్ రిలేషన్‌లో ఉన్న రామకేశ్ మీనా(32)ని హత్య చేసింది. ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థిని కాబట్టి పక్కా ప్లాన్‌తో ఆ హత్యని ప్రమాదంగా చిత్రీకరించింది. ఢిల్లీలో జరిగిన ఈ భయంకరమైన హత్య కేసును పోలీసులు చేధించారు. ఇదొక సాధారణ అగ్నిప్రమాదంగా భావించినా, తర్వాత ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థిని, ఆమె మాజీ ప్రియుడు, మరో వ్యక్తి సాయంతో చేసిన హత్యగా తేలింది.

మృతుడు రామకేశ్ మీనా (32), సివిల్ సర్వీస్ అభ్యర్థి. నిందితురాలు అమృత చౌహాన్ (21), ఫారెన్సిక్ సైన్స్‌ విద్యార్థిని. వీరు కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. వ్యక్తిగత మనస్పర్ధల కారణంగా అవమానానికి గురైన అమృత, మీనాపై పగ పెంచుకుంది. కలిసి ఉన్నప్పుడు వారిమధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల కారణంగా అతన్ని హత్య చేయాలని అమృత అనుకుంది. ఎక్స్ లవర్ సుమిత్ కశ్యప్ (27), అతని స్నేహితుడు సందీప్ కుమార్ (29) సాయం తీసుకుంది. సుమిత్ ఒక ఎల్‌పీజీ గ్యాస్ పంపిణీదారుడిగా పనిచేస్తున్నాడు.

అమృత, సుమిత్, సందీప్ కలిసి మీనా ఉండే ఫ్లాట్‌కు చేరుకున్నారు. ముగ్గురూ కలిసి మొదట మీనాను గొంతు నులిమి చంపారు. ఆ తర్వాత, హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు వారి ప్లాన్ అమలు చేశారు. పోలీసుల ప్రకారం, ఫారెన్సిక్ సైన్స్‌లో అమృతకు ఉన్న  నాలెడ్జ్, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్‌గా సుమిత్ గ్యాస్‌పై ఉన్న అవగాహనను ఉపయోగించి ఈ నేరాన్ని చేశారు. వారు చనిపోయిన రామకేశ్ మీనా శరీరంపై నెయ్యి, నూనె, ఆల్కహాల్ పోశారు. అనంతరం సుమిత్ గ్యాస్ సిలిండర్ వాల్వ్‌ను తెరచి, గ్యాస్ లీకయ్యేలా చేసి ఫ్లాట్‌కు నిప్పు పెట్టాడు. దీంతో పెద్ద పేలుడు సంభవించి, మృతదేహం పూర్తిగా కాలిపోయింది. బయటనుంచి చూసేవారికి అది ఏసీ పేలుడు లేదా షార్ట్ సర్క్యూట్‌ వల్ల జరిగిన ప్రమాదంగా కనిపించింది.

సీసీటీవీ ఫుటేజ్, ఫారెన్సిక్ ఆధారాల ఆధారంగా ఇది హత్యగా నిర్ధారించిన పోలీసులు, అమృతను అరెస్టు చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు, సుమిత్, సందీప్‌లను కూడా అరెస్టు చేశారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి, వారు మీనా హార్డ్ డిస్క్‌, ల్యాప్‌టాప్‌, ఇతర వస్తువులను కూడా తీసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. అమృత క్రైమ్ వెబ్ సిరీస్‌లను ఎక్కువగా చూసేదని, ఆ స్ఫూర్తితోనే ఈ పక్కా ప్లాన్ చేసిందని పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు