కుంభమేళా తొక్కిసలాట బాధితులకు యూపీ సర్కార్ ఎక్స్‌గ్రేషియా

ప్రయాగ్‌రాజ్ కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది చనిపోయినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. ఘాట్‌లోని బారికెట్లు ద్వంసం కావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని డీఐజీ వైష్ణవ్ కృష్ణ తెలిపారు. యూపీ సర్కార్ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

New Update
up sarkar

up sarkar Photograph: (up sarkar )

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళా తొక్కిసలాటలో మృతుల సంఖ్య పోలీసులు అధికారికంగా వెల్లడించారు. జనవరి 29 తెల్లవారుజామున ఘాట్‌లో ఏర్పాటు చేసిన బారికెట్లు ద్వంసం కావడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని డీఐజీ వైష్ణవ్ కృష్ణ తెలిపారు. మొత్తం 30 మంది ఈవిషదంలో చనిపోయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.

Read also : kumbhmela : అప్పుడు కూడా ఇలానే.. కుంభమేళాలో 800 మంది మృతి

మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తొక్కిసలాటపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ విషాద ఘటనలో 90 మందిని హాస్పిటల్‌లో చేర్పించామని వారిలో 36 మందికి తీవ్ర గాయాలు అయినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జస్టిస్ కృష్ణ కుమార్ ఆద్వర్యంలో న్యాయ విచారణకు రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. 

Read also : BIG BREAKING: మహా కుంభమేళా తొక్కిసలాటలో 30 మంది మృతి.. యోగీ సర్కార్ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు