/rtv/media/media_files/2025/02/02/V2RAZBrnwNF4DF7TLdY3.jpg)
UP man took Rs 40,000 loan
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ సంచలన ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తనకు వరసయ్యే కోడలను చంపేందుకు రూ.40 వేలు అప్పు చేసి మరి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, అతనికి సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. తన కోడలు తనను బ్లాక్ మెయిల్ చేస్తోందని, అందుకే హత్య చేశానని నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. జనవరి 21 న మీరట్‌లోని నాను కెనాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆశిష్ అనే నిందితుడు తన 21 ఏళ్ల కోడలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇద్దరికి సంబంధించిన ప్రైవేటు ఫొటోలు, వీడియోలు చూపించి ఆమె నిత్యం ఏదో ఒకటి అతన్ని డిమాండ్ చేస్తూ వచ్చేది. ఈవిషయం ఎక్కడ బయటకు వస్తుందో అని భయపడిన ఆశిష్ తన కోడలిని హత్య చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఒకతని దగ్గర రూ. 40 వేల అప్పు తీసుకున్న అశిష్ మరో ఇద్దరు శుభం, దీపక్ లతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు.
హత్య కోసం అప్పు
ముందుగా వారికి రూ.10 వేలు అడ్వాన్స్ గా ఇచ్చి.. హత్య అనంతరం మిగిలిన రూ.20 వేలు చెల్లిస్తానని వారికి ఆశిష్ హామీ ఇచ్చాడు. బాధితురాలని జనవరి 21వ తేదీన ఓ కాలువ వద్దకు తీసుకెళ్లినఆశిష్ మిగితా నిందితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసి ఆపై దుపట్టాతో గొంతుకోసి హత్య చేశాడు. గుర్తు తెలియకుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. బాధితురాలి కుటుంబ సభ్యులు జనవరి 23న మిస్సింగ్ రిపోర్టు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో ఆమె చివరిసారిగా ఆశిష్, శుభం, దీపక్‌లతో కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆశిష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేయగా అతను నేరం అంగీకరించాడు. అశిష్ కు బాధితురాలితో రెండేళ్లుగా అక్రమ సంబంధం ఉంది.
Also Read : తండ్రి కల కోసం క్రికెట్ లోకి .. భారత్కు వరల్డ్ కప్ తెచ్చిపెట్టిన తెలంగాణ అమ్మాయి!