/rtv/media/media_files/2025/02/02/4YvN8AhipfMK6B9OmaqD.jpg)
Trisha Gongadi Photograph: (Trisha Gongadi )
టీమిండియాకు అండర్ 19 టీ20 వరల్డ్ కప్ అందించిన తెలుగమ్మాయి గొంగడి త్రిష పేరు ఇప్పుడు మారుమ్రోగుతోంది. 19 ఏళ్ల త్రిష 7 మ్యాచ్లలో కలిపి 309 పరుగులు చేసి జట్టుకు కప్ రావడంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసింది కూడా గొంగడి త్రిషనే కావడం విశేషం. కేవలం బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లోనూ త్రిష అదరగొట్టింది. 7 వికెట్లు తీసింది. ఈ క్రమంలో గొంగడి త్రిష బ్యాక్ గ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు.
త్రిష 2005, డిసెంబరు 15న తెలంగాణ లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంలో జన్మించింది. ఈమె తండ్రి రాంరెడ్డి. ఈయనకు త్రిష ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టమున్న రాంరెడ్డికి త్రిషకు కూడా అదేరంగంలో ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకుని ఈ దిశగా ప్రోత్సహించారు. మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే క్రికెట్ పై ఆసక్తితో క్రికెట్ లో మెళకువలు నేర్చుకుంది. ఎనిమిదేళ్ళ వయసులోనే ప్రతిభ చూపి జిల్లాస్థాయి అండర్-16 జట్టుకు ఆడి ఉమెన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైంది. ఆ తరువాత 12 ఏళ్ళ వయసులో అండర్-19 జట్టుకు ఆడింది.
12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికైన త్రిష, చిన్న వయసులోనే బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కూడా గెలుచుకుంది. లెగ్ స్పిన్నర్ అయిన త్రిష, బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో రాణిస్తూ ఆల్ రౌండర్ గా పేరు సంపాదించింది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డును కూడా నెలకొల్పింది. క్రికెట్‌లో శిక్షణ తీసుకోవడానికి చాలా డబ్బు ఖర్చు అయినప్పుడు తన తండ్రి వెనకాడకుండా ప్రోత్సహించారు. ఆయన కల నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగిన త్రిష.... ఇప్పుడు కోట్లమంది అభిమానుల కలను కూడా నెరవేర్చారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో
దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో వాన్ వూరస్ట్ (23) చేసిన పరుగులే టాప్ స్కోర్. ఆ తరువాత 83 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ను ఫినిష్ చేశారు. గొంగడి త్రిష టోర్నీలో బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటారు. దీంతో వరుసగా భారత్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది.
Also Read : Delhi Poll Prediction: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్ సర్వేలో సంచలన విషయాలు