యూపీ-నేపాల్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌.. దుర్గామాత వేడుకల్లో మొదలై..!

యూపీ - నేపాల్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. దుర్గమాత నిమజ్జనంలో డీజే కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలో బహ్రెయిచ్ జిల్లాకు చెందిన రామ్ గోపాల్ మిశ్రాను ఐదుగురు కాల్చి చంపారు. నిందితులు నేపాల్ పారిపోతుండగా కాల్పులు జరిపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

author-image
By srinivas
ddfdere r
New Update

Encounter: భారత్‌లోని ఉత్తర్‌ప్రదేశ్‌ - నేపాల్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. యూపీ బహ్రెయిచ్‌ జిల్లాలోని అక్టోబర్ 13న దుర్గా మాత నిమజ్జన కార్యక్రమంలో ఉద్రిక్తతలు ఇరువర్గాల మధ్య మొదలైన గొడవ ఒ వ్యక్తి ప్రాణం తీసేవరకూ వెళ్లింది. ఈ మేరకు దుర్గమాత నిమజ్జనంలో డీజే సౌండ్ ఎక్కువగా పెట్టొద్దని, ఇబ్బందిగా ఉందని చెప్పిన వ్యక్తిపై ఐదుగురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దురుసుగా ప్రవర్తిస్తూ రామ్‌ గోపాల్ మిశ్రాపై దాడి చేసిన యువకులు చివరికి గోపాల్ మిశ్రాను కాల్చి చంపేశారు. అనంతరం నేపాల్ పారిపోతుండగా.. నిందితులను పట్టుకునే క్రమంలో STF పోలీసులు వెంబడించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నిందితులు సర్ఫరాజ్‌, ఫహిమ్‌కు గాయాలైనట్లు తెలిపారు. 

ఇది కూడా చదవండి: డకౌట్‌లో తిరుగులేని వీరులు.. కోహ్లీ, రోహిత్ ఆల్‌టైమ్ రికార్డు!

ఈ నేపథ్యంలో మరో ముగ్గురిని కస్టడీలోకి తీసుకున్న స్పెషల్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ హమీద్‌ కొడుకు సర్ఫరాజ్‌ హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఇక కేసు విచారణలో డీజే సౌండ్ కారణంగా రెండు వర్గాల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీంతో గత మూడు రోజులుగా బహ్రెయిచ్ జిల్లాలో ఉద్రిక్తతలు చోటుచేసుకోగా మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.

ఇది కూడా చదవండి: TGPSC GROUP-1: గ్రూప్-1 మెయిన్స్ పై సీఎస్ కీలక ఆదేశాలు!

రెహువా మన్సూర్ గ్రామానికి చెందిన బాధితుడు రామ్ గోపాల్ మిశ్రా కుంటుంబానికి న్యాయం చేస్తామని సీఎం యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. మిశ్రా కుటుంబాన్ని ఆఫీసుకు పిలిపించుకుని తప్పకుండా న్యాయం చేస్తామని యోగి చెప్పారు. పోలీస్ స్టేషన్ ముందు బాధితుడి బంధువులు ఆందోళనకు దిగిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చదవండి:'విశ్వం' సక్సెస్ కోసం కావ్య థాపర్ ఇలా చేసిందంటే నమ్ముతారా!

ఇది కూడా చదవండి:Telangana: తెలంగాణలో మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ !

#encounter #nepal #uttarapradesh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe