Sangareddy : తెగించిన కామాంధులు.. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై.. !

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.  నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు.  సంగారెడ్డి మండలంలోని ఫసల్ వాదీలో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
sangareddy case

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. చాక్లెట్ ఆశ చూపి ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు కామాంధులు అఘాయిత్యానికి పాల్పడ్డారు.  నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు స్థానికులు.  సంగారెడ్డి మండలంలోని ఫసల్ వాదీలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారిపై ఇద్దరు కన్నేశారు.  చాక్లెట్ ఆశ చూపి ఆ బాలికను తమ వెంట తీసుకెళ్లి చెట్ల పొదల్లోకి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. 

Also Read :  కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

చిన్నారి కేకలు వేయడంతో విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు.  దీంతో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు కామాంధులను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.  నిందితులు ఇద్దరు బాగా తాగి ఈ అఘాయిత్యానికిపాల్పడినట్లుగా తెలుస్తోంది. చిన్నారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద అర్థరాత్రి హైడ్రామా నెలకొంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Also read :  తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

భార్యను నరికి

మరోవైపు సంగారెడ్డి జిల్లాలో భార్యను నరికి చంపేశాడో భర్త.  మద్యం మత్తులో భర్త గుండప్ప తన భార్య చంద్రమ్మ (45) ను గొడ్డలితో నరికి హత్య చేశాడు.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గుండప్పను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.   గుండప్ప, చంద్రమ్మ మధ్య తరచూ గొడవలు జరగుతుండేవని స్థానికులు చెబుతున్నారు.  కాగా వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.  

Also Read :  కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ ..  15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్  !

Also Read :  మ్యాట్రిమోనిలో వల.. పెళ్లి పేరుతో 15 మందిని రేప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు