Pahalgam Attack: లెఫ్టినెంట్ భార్యపై కామెంట్లు.. పోలీసులు అదుపులోకి నిందితుడు

పహల్గామ్‌ ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్‌ మృతి చెందడంతో భర్త మృతదేహం దగ్గర రోధించింది. ఈ ఫొటో వైరల్ కావడంతో ఒసఫ్ ఖాన్ దారుణ కామెంట్ చేశాడు. ఈమెపై దర్యాప్తు చేయాలని.. ఆమె ఒక షూటర్‌తో కావాలనే భర్తను చంపిందన్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

New Update
Osaf Khan

Osaf Khan

Pahalgam Attack: జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో లెఫ్టినెంట్ వినయ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 16వ తేదీన వివాహం జరగ్గా వీరు హనీమూన్‌కి పహల్గామ్ వెళ్లగా.. ఉగ్రదాడికి బలి అయ్యాడు. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో లెఫ్టినెంట్ వినయ్‌తో పాటు మొత్తం 28 మంది మృతి చెందారు. అయితే పెళ్లయిన ఆరు రోజులకే భర్త చనిపోవడంతో.. మృతదేహం దగ్గర భార్య హిమాన్ష్ రోధించింది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఓ వ్యక్తి దారుణంగా కామెంట్ చేశాడు.

ఇది కూడా చూడండి:Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

ఇది కూడా చూడండి:PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

వాస్తవాలు, అవాస్తవాలు ఏంటో పట్టించుకోకుండా చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు. హిమాన్ష్ బాధపడుతున్న ఫొటోకి కూడా జబల్‌పూర్‌కు చెందిన ఒసఫ్ ఖాన్ అనే వ్యక్తి ఓ కామెంట్ చేశాడు. ఈ మహిళపై దర్యాప్తు చేయాలని.. ఆమె ఒక షూటర్‌ను ఏర్పాటు చేసి కావాలనే తన భర్తను చంపించి ఉండవచ్చని అన్నాడు. దీంతో నెటిజన్లు ఒసఫ్‌పై మండిపడ్డారు. అభయ్ శ్రీవాస్తవ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఒసఫ్ ఖాన్‌ను అరెస్టు చేశారు. 

ఇది కూడా చూడండి:New Smartphone: శాంసంగ్ M56 5G ఫస్ట్ సేల్ షురూ.. భారీ డిస్కౌంట్- ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే!

Advertisment
తాజా కథనాలు